
వైరల్: ఇంటర్నెట్, సోషల్ మీడియా.. అందునా వీడియో స్ట్రీమింగ్ సర్వీస్ యూట్యూబ్ మన జీవితంలో ఒక భాగమైపోయింది. అలాంటి ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన మొదటి వీడియో ఏదో తెలుసా?
యూట్యూబ్ అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఉంచింది యూట్యూబ్ ఇండియా. యూట్యూబ్‌సహ వ్యవస్థాపకుడు జావెద్ కరీం అప్‌లోడ్ చేసిన ఆ వీడియోను.. పదిహేడేళ్ల కిందట అప్‌లోడ్ చేశారట. శాన్ డియాగో(కాలిఫోర్నియా) జూ ఎన్‌క్లోజర్‌లో ఏనుగు దగ్గర ఉండి ఆయన వీడియో తీసుకున్నాడు.
ఆయన తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన ఏకైక వీడియో ఇదేకాగా.. దానికి 235 మిలియన్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ అధికారికంగా లాంఛ్ అయ్యింది ఫిబ్రవరి 14, 2005లో. గూగుల్ తర్వాత ఈ ప్రపంచంలో అత్యధిక మంది ఉపయోగించే వెబ్‌సైట్‌గా యూట్యూబ్ ఆన్‌లైన్ వీడియో షేరింగ్ యాప్‌కు పేరుంది.
Comments
Please login to add a commentAdd a comment