జైపూర్: కోవిడ్ మహమ్మారి ఒమిక్రాన్ వేరియంట్‌గా రూపాంతరం చెంది ప్రపంచదేశాలతో పాటు భారత్‌ను అల్లాడిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ వేరియంట్ కారణంగా భారత్‌లో ఒక్క మరణం కూడా లేకపోవడంతో ప్రభుత్వాలు, ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే తాజాగా ఒమిక్రాన్ తొలి మరణం రాజస్తాన్‌లో నమోదైనట్లు కేంద్రం తెలిపింది. వివరాల ప్రకారం.. 72 ఏళ్ల ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్‌తో పాజిటివ్‌గా రావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు.
చికిత్స తీసుకుంటుండగా అతనికి ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని ఒక అధికారి తెలిపారు. ఇదివరకే మహరాష్ట్ర నుంచి ఓ బాధితుడి ఒమిక్రాన్ కారణంగా మృతి చెందినట్లు వార్తలు వచ్చినప్పటికీ అతని మరణానికి ఒమిక్రాన్ కారణం కాదని తేలింది. దీంతో రాజస్తాన్‌లో నమోదైన మరణమే దేశంలో తొలి ఒమిక్రాన్ మరణంగా నమోదైంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం అధికంగా కనిపిస్తోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం 653 ఒమిక్రాన్ కేసులు ఉండగా ఢిల్లీలో 464 మంది ఒమిక్రాన్ బారిన పడ్డారు. రాజస్థాన్‌లో 174 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 2,135 ఒమిక్రాన్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
చదవండి: Omicron Variant Updates In India: ‘ఒమిక్రాన్ కేసుల జోరు.. భారత్‌లో మూడో వేవ్, ఢిల్లీలో ఐదో వేవ్’
Comments
Please login to add a commentAdd a comment