
అగ్గికే హడల్
♦ అత్యవసర సేవలలో అగ్నిమాపక శాఖ ఫస్ట్.. బెస్ట్
♦ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలను కాపాడుతున్న అగ్నిమాపక సిబ్బంది
♦ నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
ఇబ్రహీంపట్నం రూరల్: అగ్ని ప్రమాదాలకే హడలెత్తిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. రాత్రి పగలు అనే తేడా లేకుండా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను విపత్తుల నుంచి రక్షిస్తున్నారు. గతంలో పల్లెలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే నగ రం నుంచి ఫైరింజన్ వచ్చే వరకు ఎదు రు చూపులు తప్పేది కాదు. ఇంత లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయేది. కానీ ప్రభుత్వం అగ్నిమాపక కేంద్రాలను మం డల కేంద్రాల్లో కూడా ఏర్పాటు చేయడంతో ప్రమాదం జరిగిన వెంటనే ఘట నా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పి స్తూ ప్రజల మన్నన్నలు పొందుతున్నారు ఫైర్ సిబ్బంది. అగ్ని ప్రమాదాలపై ప్రజ లకు అవగాహన కల్పిం చేందుకు ఈ నె ల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు.
అవగాహనతోనే..
ప్రజల అవగాహన రాహిత్యంతోనే ఎ క్కువ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయని పేర్కొంటున్నారు అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండి వెంటనే స్పందించే 90శాతం ప్రమాదాలను అడ్డుకోవచ్చునని, ఆ దిశగా ప్రజలను చైతన్యవంతం చేసేం దుకు ప్రభుత్వం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు. అగ్ని ప్రమాద రహిత సమాజమే ధ్యేయంగా 101 నంబర్‌కు కాల్ చేస్తే వెంటనే స్పందిస్తామని చెబుతున్నారు.
నేటికి 100 ప్రమాదాలకు పైగా ఎదుర్కొన్న సిబ్బంది
ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని బోంగ్లూర్ సమీపంలో 2013 నవంబర్ 22న అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లో చోటుచేసుకున్న సుమారు 100 పైగా ప్రమాదాలను ఎదుర్కొన్నారు. ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా కాపాడారు.
అవగాహన కల్పిస్తాం
నేటి నుంచి 20వ తేదీ వరకు వారం రోజులు వివిధ ప్రదేశాల్లో అవగహన సదస్సులు నిర్వహిస్తాం. అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నప్పుడు ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తాం. ప్రతి సంవత్సరం ఈ వారం రోజులు మాకు పండగలా ఉంటుంది. - దెంది మధుకర్‌రెడ్డి, ఫైర్‌మన్
ప్రజల సహకారంతోనే విపత్తులకు చెక్
మా కేంద్రంలో 14 మంది సిబ్బంది ఉన్నారు. ఎక్కడ విపత్తులు సంబవించినా స్పందించి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నాం. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల పాత్ర ఎంతో కీలకం, విద్యుత్, ఎలక్ట్రిక్ ప్రమాదాలపై సరైన సమయంలో స్పందించాలి. లేకుంటే నష్టం తీవ్రస్థాయిలో ఉంటుంది. - కుమార్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, ఇబ్రహీంపట్నం