యంగ్ హీరో నిఖిల్.. 'కార్తికేయ 2'తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఒక్క దెబ్బకు పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో నెక్స్ట్ మూవీస్ లైనప్‌ని పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు. అలా చేసిన సినిమా 'స్పై'. ట్రైలర్‌తో ఇది అంచనాలు పెంచినప్పటికీ.. థియేటర్లలో ఫెయిలైంది. ఇప్పుడు సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: మెగాస్టార్ చిరంజీవికి సర్జరీ జరిగిందా?)
'స్పై' కథేంటి?
జై(నిఖిల్).. 'రా' ఇంటెలిజెన్స్‌లో సీక్రెట్ ఏజెంట్. శ్రీలంకలో ఓ మిషన్‌లో ఉండగా స్వదేశంలోని ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. 'రా' చీఫ్ శాస్త్రి (మకరంద్ దేశ్‌పాండే).. గతంలో చనిపోయిన ఏజెంట్ సుభాష్ వర్ధన్ (ఆర్యన్ రాజేశ్) ఫైల్ అప్పగిస్తాడు. అతడి చావుకి కారణం తెలుసుకోమని ఆర్డర్ వేస్తాడు. ఈ మిషన్‌లో భాగంగా జై పలు సవాళ్లని ఎదుర్కొంటాడు. చివరకు ఏమైందనేదే స్టోరీ.
అందులో స్ట్రీమింగ్
కంటెంట్ వీక్ కావడంతో 'స్పై' సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. జూన్ 27న థియేటర్లలోకి వస్తే.. తొలి వీకెండ్‌కే తట్టాబుట్టా సర్దేసుకుంది. దీంతో అందరూ ఆ చిత్రాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఆ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో సైలెంట్‌గా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేశారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 'స్పై' స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో కాబట్టి ఆడుతూ పాడుతూ ఈ మూవీని చూసేయొచ్చు.
#SpyMovie now streaming in @PrimeVideo #NikhilSiddharth #Spy pic.twitter.com/FRJmfwcRf3
— Matters Of Movies (@MattersOfMovies) July 26, 2023
(ఇదీ చదవండి: ప్రభాస్ కొత్త సినిమా.. ఆ స్టార్ హీరో డైరెక్షన్‌లో!)
Comments
Please login to add a commentAdd a comment