Nikhil Siddhartha, Anupama Parameswaran Karthikeya 2 Movie Trailer Out Now - Sakshi
Sakshi News home page

Karthikeya 2 Trailer: కార్తికేయ 2 ట్రైలర్‌ అదిరిపోయిందిగా!

Published Fri, Jun 24 2022 6:19 PM | Last Updated on Fri, Jun 24 2022 6:43 PM

Nikhil Siddhartha, Anupama Parameswaran Karthikeya 2 Trailer Out Now - Sakshi

యంగ్‌​ హీరో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకు సీక్వెల్‌గా వస్తోంది చిత్రం. సముద్రం దాచుకున్న అతి పెద్ద రహస్యం.. ద్వారకా నగరం అంటూ ఇటీవల రిలీజైన మోషన్‌ పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈసారి డైరెక్టర్‌ శ్రీకృష్ణుడి జన్మస్థలమైన ద్వారకను ఆధారంగా తీసుకుని సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. శాంతను.. 'ఇది నువ్వు ఆపలేని యాగం.. నేను ఓ సమిధను మాత్రమే, ఆజ్యం అక్కడ మళ్లీ మొదలైంది' అంటూ హీరోకు ఎలివేషన్‌ ఇచ్చారు. మొత్తానికి ట్రైలర్‌తో మరోసారి మెప్పించారు.

ఈ సినిమాలో కార్తికేయగా నిఖిల్, ముగ్ధ పాత్రలో అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్నారు. అతి ముఖ్యమైన ధన్వంతరి పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటిస్తుండగా.. శాంతనుగా ఆదిత్య మీనన్.. సదానందగా శ్రీనివాస్ రెడ్డి.. సులేమాన్‌గా వైవా హర్ష కనిపించనున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రి, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బేన‌ర్స్‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ జూలై 22న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుదల కానుంది.

చదవండి: సదా నన్ను నడిపే మూవీ రివ్యూ
 రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్‌, స్పందించిన వర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement