
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఓ టీవీ షోలో ఆయన స్వయంగా వెల్లడించారు. తాను దర్శకుడిగా తెరకెక్కించే తొలి మూవీ.. చిన్నారులకు సంబంధించిందిగా తెలిపారు. ఇందులో ఐదుగురు చిన్నారులు ముఖ్యపాత్రల్లో నటించనున్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా అడ్వెంచరస్ థ్రిల్లర్ సినిమా అని చెప్పారు. చిన్న పిల్లల సినిమా అయినప్పటికీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు.
అయితే దర్శకత్వంపై నిఖిల్ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘చిన్న పిల్లల చిత్రానికి సంబంధించిన పూర్తి స్థాయి స్క్రిప్ట్ రాశాను. ఈ చిత్రాన్ని ఇప్పట్లో తెరక్కెక్కించలేను. ప్రస్తుతం నేను ‘కార్తికేయ-2, 18 పేజీస్' చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటాను. ఆ తర్వాతే మెగాఫోన్ పట్టుకునేది’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇక నిఖిల్ సిద్దార్థ్ తన సినిమా కెరీర్‌ను మూవీ టెక్నీషియన్‌గా ప్రారంభించారు. ‘హైదరాబాద్ నవాబ్స్’అనే సినిమాకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. తర్వాత డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘హ్యాపీడేస్’ చిత్రంతో నిఖిల్ నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక నిఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. కరోనా లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. తన ప్రేయసి పల్లవి వర్మను పెద్దల సమక్షంలో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు.
Thanks for the Love nd Response... We Wrote a Bound Script for a Childrens Film but I will Not be Directing anytime soon Since the Heavy/Hectic Shoots of Both my films #18Pages & #Karthikeya2 will be taking off from October-November of this year.
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 16, 2020
Cu in Theatres Soon 😇👍🏼 https://t.co/s2EBlxG5Cp