టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న 19వ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. గూడఛారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే కదా! తాజాగా ఈ సినిమాకు స్పై అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నిఖిల్ గన్ చేతపట్టుకుని బుల్లెట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మేకర్స్.
స్పై చిత్రంలో నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హాలీవుడ్ టెక్నీషియన్ జులియన్ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నారు. అలాగే మరో హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
The sentinel is geared up for the Task!
— Nikhil Siddhartha (@actor_Nikhil) April 17, 2022
Unfolding & Presenting 𝐒𝐏𝐘🔥#SPY ATTACKING PAN INDIAN THEATRES this DASARA 2022😎
స్పై - स्पाई - ஸ்பை - ಸ್ಪೈ - സ്പൈ@Ishmenon @Garrybh88 @AbhinavGomatam @tej_uppalapati @julian_amaru #EDEntertainments #KRajashekarreddy pic.twitter.com/MBRlUsb7it
చదవండి: పదిహేను రోజుల్లోనే ఓటీటీలోకి గని, స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Comments
Please login to add a commentAdd a comment