ప్రేయ‌సిని పెళ్లాడిన హీరో నిఖిల్ | Hero Nikhil siddharth Married Pallavi On Thursday Morning At Shameerpet | Sakshi
Sakshi News home page

ఇంటివాడైన హీరో నిఖిల్‌‌

Published Thu, May 14 2020 8:16 AM | Last Updated on Thu, May 14 2020 3:22 PM

Hero Nikhil siddharth Married Pallavi On Thursday Morning At Shameerpet - Sakshi

యువ హీరో నిఖిల్ సిద్ధార్థ ఎట్ట‌కేల‌కు ఓ ఇంటి వాడ‌య్యాడు. అనేక వాయిదాల అనంత‌రం గురువారం ఉద‌యం 6.31 నిమిషాల‌కు తాను ప్రేమించిన ఇష్ట‌స‌ఖిని మూడు ముళ్ల బంధంతో మ‌నువాడాడు. పంచ‌భూతాల సాక్షిగా డాక్ట‌ర్ ప‌ల్ల‌వి వ‌ర్మ‌తో ఏడ‌డుగులు వేశాడు. షామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేటు అతిథి గృహంలో నిఖిల్ ప‌ల్ల‌విల వివాహం శాస్త్రోక్తంగా జ‌రిగింది. మొద‌ట‌ ఏప్రిల్ 16న వీరి పెళ్లికి అన్ని ఏర్పా‌ట్లు చేసుకున్నారు. అయితే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా వ్యాప్తి చెందిన నేప‌థ్యంలో వివాహం వాయిదా ప‌డింది. ఈ వేడుక‌కు నేడు మూహుర్తం ఖ‌రారయ్యింది. క‌రోనా కార‌ణంగా లాక్‌డౌన్ అమలులో ఉన్న నేప‌థ్యంలో అతి కొద్ది మంది అతిథుల మ‌ధ్య నిరాడంబ‌రంగా హిందు సాంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లి వేడుక జ‌రిగింది. పూర్తి  నిబంధ‌న‌లు, భౌతిక దూరం పాటిస్తూ ప‌చ్చ‌ని పందిరిలో పెళ్లితో ఒక‌ట‌య్యారు. వివాహానికి హాజరైన బంధువులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.

కాగా బుధ‌వారం రాత్రి నిఖిల్‌ను పెళ్లి కొడుకు, ప‌ల్ల‌విని పెళ్లికూతురుని చేశారు. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. అభిమానుల మ‌ధ్య అంగ‌రంగ వైభవంగా పెళ్లి చేసుకోవాల్సిన నిఖిల్.. ఇలా సాదాసీదాగా చేసుకోవ‌డంతో అత‌ని అభిమానులు కాస్తా నిరాశ‌కు గుర‌వుతున్నారు. స్వామిరారా, సూర్య వర్సెస్‌ సూర్య, కార్తికేయ, ఎక్కడకి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్‌ సురవరం’ వంటి విజయాలను నిఖిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. (పెళ్లి కొడుకుగా ముస్తాబ‌వుతున్న నిఖిల్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement