లాక్‌డౌన్ కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రేయసి పల్లవి వర్మను పెళ్లాడాడు టాలీవుడ్ హీరో నిఖిల్. హైదరాబాద్ శివారులోని ఓ రిసార్ట్‌లో లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా వీరి వివాహం జరిగింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిఖిల్ అభిమానులతో పాటు శ్రేయోలాభిలాషులకు అతడి పెళ్లిని నేరుగా చూసే అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా తన పసుపు ఫంక్షన్, పెళ్లి ఫొటోలు షేర్ చేసిన నిఖిల్.. తాజాగా తన వెడ్డింగ్ వీడియోను పోస్ట్ చేశాడు.(వారికి కూడా నా ధన్యవాదాలు : నిఖిల్)
‘‘ప్రతీ ఒక్కరు నా పెళ్లికి రావాలని కోరుకున్నాను. కానీ కోవిడ్-19 లాక్‌డౌన్ వల్ల ఈ వీడియో ద్వారా మాత్రమే మీ ఆశీర్వాదాలు పొందగలనని అనుకుంటున్నాను. నా ఫేవరెట్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతోంది’’అంటూ తన జీవితంలో మధుర జ్ఞాపకాలకు సంబంధించిన దృశ్యాలు అభిమానులతో పంచుకున్నాడు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా వీడియోను చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment