టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో! | Nikhil Siddhartha Reveals Son Name, Says He Has Given Up Bad Habits - Sakshi
Sakshi News home page

Nikhil: కొడుకు కోసం అలా ఫిక్సయిన హీరో నిఖిల్

Published Fri, Apr 19 2024 7:46 PM | Last Updated on Fri, Apr 19 2024 9:14 PM

Actor Nihkil Night Parties Anymore For New Born Son - Sakshi

యంగ్ హీరో నిఖిల్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. తన ఫ్యామిలీ, రీసెంట్‌‌గా పుట్టిన కొడుకు కోసం ఓ త్యాగం చేశాడు. ఇకపై కొన్ని విషయాలకు పూర్తిగా దూరంగా ఉండాలని ఫిక్సయ్యాడు. తాజాగా తన కొడుకు గురించి చెబుతూ ఇదంతా బయటపెట్టాడు. ఇంతకీ ఏంటి విషయం?

(ఇదీ చదవండి: హీరోయిన్‌కి చేదు అనుభవం.. సొంత భాషలో మాట్లాడినందుకు ఏకంగా!)

'హ్యాపీడేస్' సినిమాలో ఓ నటుడిగా కెరీర్ ప్రారంభించిన నిఖిల్.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. 'స్వామి రారా', 'కార్తికేయ' చిత్రాలతో పేరు సంపాదించాడు. 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ప్రస్తుతం 'స్వయంభు' అనే పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు.

నిఖిల్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2020లో పల్లవి అనే డాక్టర్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వీళ్లకు బాబు పుట్టాడు. తాజాగా తన కొడుక్కు ధీర సిద్ధార్థ అని పేరు పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఎప్పుడో ఓసారి అయినా నైట్ పార్టీలకు వెళ్లేవాడినని, ఇకపై మాత్రం టైమ్ అంతా తన కొడుక్కే ఇస్తానని చెప్పుకొచ్చాడు. పిల్లలు పుడితే తల్లిదండ్రులు మారతారని అంటారు. బహుశా నిఖిల్ కూడా కొడుకుతో టైమ్ స్పెండ్ చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడనమాట.

(ఇదీ చదవండి: జబర్దస్త్‌ కమెడియన్ల బ్రేకప్‌? గొడవలు నిజమేనన్న నూకరాజు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement