
విజయవాడ : యంగ్ హీరో నిఖిల్ తన జన్మదినాన్ని నిరాడంబరంగా జరుపుకున్నారు. సోమవారం తన బర్త్ డే సందర్భంగా గన్నవరం మండలంలోని కేర్ అండ్ షేర్ అనాథ శరణాలయానికి వెళ్లిన నిఖిల్ అక్కడి పిల్లలతో సరదాగా గడిపారు. ట్రస్ట్‌కు సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తన బర్త్‌డే పార్టీకి ఖర్చు చేసే మొత్తాని.. ఆ ట్రస్టుకు విరాళంగా ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మరోవైపు నిఖిల్ బర్త్‌డే సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. (చదవండి : అది నువ్వేనా: హీరోయిన్ వీడియోకు నెటిజన్లు ఫిదా!)
‘నా పుట్టిన రోజున కొద్ది సమయం గన్నవరం కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్‌లో గడిపాను. ఈ ట్రస్ట్.. వదిలివేయబడిన మరియు అనాథ పిల్లలను సంరక్షిస్తుంది. సాధారణంగా నా బర్త్ డే పార్టీకి ఖర్చు చేసే మొత్తం డబ్బును.. ఈ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వబోతున్నాను’ అని నిఖిల్ ట్వీట్ చేశారు. కాగా, నిఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. కరోనా లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ.. తన ప్రేయసి పల్లవి వర్మను పెద్దల సమక్షంలో నిఖిల్ పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా తర్వాత నిఖిల్ జరుపుకుంటున్న తొలి బర్త్ డే కావడంతో.. పల్లవి కూడా స్పెషల్ విషెస్ తెలిపారు. ‘హ్యాపీ బర్త్‌డే లవ్.. నువ్వు చాలా బలంగా ఉంటావు.. అయినప్పటికీ సున్నితమైన విషయాలపై చాలా సున్నితంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండాలని, నీ కలలు నిజం కావాలని నేను కోరుకుంటున్నాను’ అని పల్లవి పేర్కొన్నారు.