టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మధ్యే తండ్రిగా ప్రమోషన్ పొందాడు. అతడి భార్య పల్లవి వర్మ ఫిబ్రవరి 21న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ తెగ సంతోషించాడు. ఏడాది క్రితం నాన్న చనిపోయాడని, ఆయనే మళ్లీ తన కొడుకుగా తిరిగి వచ్చాడంటూ ఎమోషనలయ్యాడు. కుమారుడిలోనే తండ్రిని చూసుకుని మురిసిపోయాడు.
తాజాగా నిఖిల్ ఇంట అతడి తనయుడి బారసాల వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. నిఖిల్-పల్లవి దంపతులు తమ కుమారుడికి కొత్త బట్టలు వేసి తొట్లె(ఊయల)లో వేశారు. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ దంపతులు బాబుకు ఏ పేరు పెట్టి ఉంటారా? అని అభిమానులు ఆలోచిస్తున్నారు.
కాగా నిఖిల్ - పల్లవి 2020వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. హ్యాపీ డేస్ సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన నిఖిల్ 'కార్తికేయ 2' సినిమాతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం స్వయంభూ అనే మూవీతో బిజీగా ఉన్నాడు.
చదవండి: స్టేజీపై హీరోయిన్‌కు హారతి.. వామ్మో.. బానే ఎక్స్‌ట్రాలు కొడ్తున్నాడే!
Comments
Please login to add a commentAdd a comment