ఉచితంగా 'సలార్' టికెట్స్.. తెలుగు యంగ్ హీరో బంపరాఫర్ | Actor Nikhil Siddhartha 100 Salaar Movie Tickets Give Away To Fans For 1 AM Show In This Theatre, Deets Inside - Sakshi
Sakshi News home page

Salaar Movie: మిడ్ నైట్ ఒంటి గంట షో.. ఫ్రీగా టికెట్స్ ఇవ్వబోతున్న ఆ హీరో

Published Sat, Dec 16 2023 5:24 PM | Last Updated on Sat, Dec 16 2023 5:40 PM

Actor Nikhil Siddhartha 100 Tickets Give Away Salaar Movie - Sakshi

స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అభిమానులు దగ్గర నుంచి సాధారణ ప్రేక్షకుల వరకు టికెట్స్ కోసం తెగ ట్రై చేస్తారు. ఇక ప్రభాస్ లాంటి మాస్ కటౌట్ నుంచి 'సలార్' మూవీ వస్తుందంటే.. ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి తీరాల్సిందేనని వీరాభిమానులు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు యంగ్ హీరో బంపరాఫర్ ప్రకటించాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ 7: స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అర్జున్‌ ఎలిమినేట్‌!)

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ మూవీ 'సలార్'. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం.. మరో వారంలో అంటే ఈ డిసెంబరు 22న థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే పలుచోట్ల బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఇంకొన్ని చోట్ల అవుతున్నాయి. మరోవైపు యంగ్ హీరో నిఖిల్.. ప్రభాస్ వీరాభిమానుల కోసం 100 టికెట్స్ ఉచితంగా ఇస్తానని ఆఫర్ ప్రకటించాడు.

డిసెంబరు 22న అర్థరాత్రి ఒంటి గంటకు శ్రీరాములు థియేటర్‌లో 'సలార్' మిడ్ నైట్ షో పడనుంది. ఇప్పుడు ఇక్కడే 100 మంది ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్‌తో కలిసి సినిమా చూస్తానని యువ హీరో నిఖిల్ చెప్పాడు. ఈ టికెట్స్ అన్నీ కూడా తనవైపు నుంచి ఫ్రీగానే ఇస్తానని మాటిచ్చాడు. మరి ఆ అదృష్టవంతులు మీరు కూడా కావొచ్చేమో. కాస్త ట్రై చేయండి.

(ఇదీ చదవండి: ప్రభాస్‌ గొప్పతనం గురించి చెప్పిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement