పెళ్లి ఫొటోల్లో.. పిచ్చి పీక్స్! | wedding photography goes to peak levels, says hero nikhil siddhartha | Sakshi
Sakshi News home page

పెళ్లి ఫొటోల్లో.. పిచ్చి పీక్స్!

Published Tue, Feb 9 2016 12:48 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

wedding photography goes to peak levels, says hero nikhil siddhartha

పెళ్లి ఫొటోలను ఆయా ఫొటోగ్రాఫర్లు రకరకాల యాంగిల్స్‌లో తీస్తుంటారు. ఇందుకోసం వాళ్లు రకరకాల కష్టాలు పడుతుంటారు. సమయానికి లైటింగ్ సరిగ్గా ఉండాలి, తాము అనుకున్న ఫ్రేము సరిగ్గా రావాలి, అంతా చేసి ఫొటో తీశాక వధూవరుల్లో ఒకళ్లు కళ్లు మూయడమో, లేదా వేరేవైపు చూడటమో జరుగుతుంది. అందులోనూ ఇప్పుడు డిజిటల్ ఆల్బంలు వచ్చిన తర్వాత.. చిత్ర విచిత్రమైన యాంగిల్స్‌లో ఫొటోలు తీస్తూ.. వాటిని ఆ తర్వాత వధూవరులకు కానుకగా అందిస్తున్నారు. ఇందుకోసం పెళ్లి తంతు మొత్తం ముగిసిన తర్వాత.. వధూవరులను మాత్రమే ఒకచోట ఉంచి వాళ్లను రకరకాలుగా ఫొటోలు తీస్తున్నారు.

సరిగ్గా అలాంటి ఫొటో ఒకదాన్ని హీరో నిఖిల్ సిద్దార్థ ట్వీట్ చేశాడు. వధూవరులిద్దరూ ఎదురెదురుగా ఉండి చేతులు పట్టుకుని ఉండగా.. ఫొటోగ్రాఫర్ వాళ్లిద్దరి మధ్య కింద పడుకుని సరిగ్గా ఆ చేతుల కిందకు తన కెమెరా వచ్చేలా ఉన్నాడు. ఆ ఫొటోను ట్వీట్ చేస్తూ.. 'వెడ్డింగ్ ఫొటోల పిచ్చి పీక్స్'  అని కామెంట్ పెట్టాడు. ఆ ట్వీట్‌ను మరో హీరో దగ్గుబాటి రానా కూడా రీట్వీట్ చేశాడు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement