Hero Nikhil Emotional Tweet About Janani Song From Rrr Movie: ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంలోని ‘‘జననీ.. ప్రియ భారత జననీ..’చూసిన తర్వాత కన్నీళ్లు ఆగడం లేదని హీరో నిఖిల్ అన్నాడు. దేశభక్తిని చాటే విధంగా రూపొందిన జనని పాట తనకు ఎంతగానో నచ్చిందని పేర్కొన్నాడు. దీనికి సంబంధించి శనివారం ఆయన ఓ ట్వీట్ చేశారు. జనని సాంగ్‌ను ఇప్పటివరకు 20సార్లు చూశాను. చూసిన ప్రతీసారి నాకు కన్నీళ్లు ఆగడం లేదు. దేశం మొత్తాన్ని ఎమోషనల్‌గా దగ్గరచేసే చిత్రమిది. కీరవాణి, రాజమౌళి ..మీరు మరోసారి మమ్మల్ని గర్వపడేలా చేశారు.
ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా పన్ను మినహాయింపు ఇవ్వాలని నా విన్నపం అని నిఖిల్ పేర్కొన్నాడు. ‘‘జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాకి ఆత్మలాంటిదని, ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారని రాజమౌళి తెలిపిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, తారక్ ప్రధాన పాత్రల్లో బిగ్గెస్ట్ మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment