ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం: టాలీవుడ్ హీరో ఆగ్రహం | Tollywood Hero Nikhil Comments On Team India Performance In FIFA | Sakshi
Sakshi News home page

Nikhil Siddhartha: దయచేసి వ్యవస్థను మార్చండి: వారిపై నిఖిల్ ఫైర్

Published Fri, Mar 22 2024 9:37 PM | Last Updated on Sat, Mar 23 2024 9:59 AM

Tollywood Hero Nikhil Comments On Team India Performance In FIFA - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఇండియా ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదర్శనకు ఇండియా ఫుట్‌ బాల్ అసోసియేషన్‌ సిగ్గు పడాలని సిద్దార్థ్ విమర్శించారు. ప్రపంచంలో ‍అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్, ఇండియన్‌ ఫుట్‌బాల్ కౌన్సిల్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

నిఖిల్ తన ట్విట్‌లో రాస్తూ..'ఫిఫా వరల్డ్ కప్‌ క్వాలిఫయర్స్‌  ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ఇప్పుడే చూశా. మన భారత జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి ప్రదర్శన పట్ల ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్‌ సిగ్గుపడాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నా. క్రీడల్లో మనం మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.' అంటూ పోస్ట్ చేశారు.

ఇది చూసిన ఫ్యాన్స్‌ హీరోకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిఖిల్‌ హీరోగా ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ-3 కూడా ఉంటుందని నిఖిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. కాగా.. ఇటీవలే సిద్ధార్థ్‌కు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement