Football Association
-
ఇది చాలా సిగ్గు పడాల్సిన విషయం: టాలీవుడ్ హీరో ఆగ్రహం
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ చేసిన నెట్టింట వైరల్‌గా మారింది. ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇండియా ఓటమిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రదర్శనకు ఇండియా ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గు పడాలని సిద్దార్థ్ విమర్శించారు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మనం ఇలాంటి మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చాలంటూ కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇండియన్ ఫుట్‌బాల్ కౌన్సిల్‌ను ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. నిఖిల్ తన ట్విట్లో రాస్తూ..'ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ ఫుట్‌బాల్ మ్యాచ్‌ని ఇప్పుడే చూశా. మన భారత జట్టు అత్యంత తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి ప్రదర్శన పట్ల ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గుపడాలి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నా. క్రీడల్లో మనం మరింత మెరుగైన ప్రదర్శన చేయాలి. దయచేసి మనదేశంలో క్రీడా వ్యవస్థను మార్చండి.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ హీరోకు మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు. సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ చిత్రంలో నటిస్తున్నారు. అంతే కాకుండా కార్తికేయ-3 కూడా ఉంటుందని నిఖిల్ ప్రకటించారు. ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించనున్నారు. కాగా.. ఇటీవలే సిద్ధార్థ్‌కు కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. Just watched the Most Frustrating Football Match of our Indian Team at the #FIFAWorldCupQualifiers The @IndianFootball association should be Ashamed for this embarrassing display. The Most Populous country in the World 🇮🇳 We deserve better.. CHANGE THE SYSTEM @ianuragthakur… pic.twitter.com/Lt9S1P2ltw — Nikhil Siddhartha (@actor_Nikhil) March 21, 2024 -
ఫుట్‌బాల్‌కూ ప్రాధాన్యత
యలమంచిలి(అనకాపల్లి రూరల్) : క్రికెట్‌తో పాటు రాష్ట్రంలో ఫుట్‌బాల్ క్రీడకూ సమాన ప్రాధాన్యత కల్పిస్తున్నామని ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. అనకాపల్లి జిల్లా యలమంచిలిలోని రాజీవ్ క్రీడా మైదానంలో ఆదివారం యలమంచిలి–విశాఖపట్నం జట్ల మధ్య జరిగిన ఫుట్‌బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన ఫుట్‌బాల్ క్రీడాకారులను గుర్తించి, వారికి మంచి తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన ఫుట్‌బాల్‌కు మన దేశంలో ఆదరణ తక్కువగా ఉందని, దీనిని పెంచడానికి ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళుతోందని తెలిపారు. భవిష్యత్‌లో రాష్ట్రం నుంచి ప్రపంచస్థాయి క్రీడాకారులను తయారుచేసేందుకు కృషి చేయనున్నట్టు చెప్పారు. ఆసక్తి ఉన్న గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు తమవంతు సహాయ, సహకారాలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అంతకుముందు స్థానిక రాజీవ్ క్రీడా మైదానంలో యలమంచిలి, విశాఖ జట్ల క్రీడాకారులను పరిచయం చేసుకున్న శ్రీధర్ రెండు జట్ల మధ్య నిర్వహించిన ఎగ్జిబిషన్ మ్యాచ్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆర్ రాజే‹Ù, కోనసీమ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నీలాద్రి, ఎన్ఐఎస్ చీఫ్ కోచ్ ఎం.శేషుమోహన్, ఉత్తరాంధ్ర కో ఆర్డినేటర్ ఎస్జీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
భారత పుట్‌బాల్ అండర్–16 జట్టుకు సౌమ్య
నిజామాబాద్ స్పోర్ట్స్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగ్లోత్ సౌమ్య భారతపుట్‌బాల్ అండర్–16 జట్టుకు ఎంపికయ్యింది. ఈ మేరకు పుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గునా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన భారత జట్టుకు ఇందూర్ జిల్లాకు చెందిన సౌమ్యనే ఎంపికైంది. గత సంవత్సరం కూడా అండర్–14 విభాగంలో సౌమ్య భారత జట్టుకు ఎంపికై నేపాల్‌లో జరిగిన టోర్నిలో తన ప్రతిభతో గోల్స్ సాధించింది. నేపాల్‌లో భూకంపం రావడం వల్ల పలు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ సంవత్సరం కూడా భారతజట్టుకు ఎంపిక కావడంపై జిల్లా పుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28నుంచి సెప్టెంబర్ 5వరకు చైనాలో జరిగే ఏఎఫ్సీ పుట్‌బాల్ కప్‌లో పాల్గొననుంది. ఇప్పటికే స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ విభాగంలో నాలుగు సార్లు జాతీయస్థాయిలో, పుట్‌బాల్ అసోసియేషన్ తరపున ఐదుసార్లు జాతీయస్థాయిలో పుట్బాల్టోర్నిలో పాల్గొని సత్తా చాటింది. జిల్లా కేంద్రంలోని రాఘవస్కూల్లో 10వ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. కోచ్ నాగరాజు పుట్‌బాల్ శిక్షణలో జిల్లా నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగింది. -
అవినీతి కేసులో ఆరుగురు ఫిఫా అధికారుల అరెస్ట్
జురిచ్: ప్రపంచ ఫుట్‌బాల్ రంగంలో అత్యంత శక్తిమంతమైన, వేలాది కోట్ల రూపాయల ఆదాయంతో సుసంపన్నమైన ఫిఫాకు షాక్. అవినీతి ఆరోపణలపై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య సంఘం (ఫిఫా) అత్యున్నత స్థాయి అధికారులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. స్విట్జర్లాండ్ అధికారులు ఈ రోజు ఉదయం అదుపులోకి తీసుకుని అమెరికాకు అప్పగించారు. ఫిఫా ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్‌లోని జురిచ్లో ఉంది. జురిచ్లో జరిగిన ఫిఫా వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు కార్యవర్గ సభ్యలు వచ్చారు. అమెరికా న్యాయశాఖ విన్నపం మేరకు స్విస్ అధికారులు అకస్మాత్తుగా ఫిఫా అధికారులు బస చేసిన హోటల్‌పై దాడి చేసి అరెస్ట్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా ఫిఫాలో అవినీతి జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ప్రపంచ ఫుట్కప్ల నిర్వహణకు బిడ్లు, మార్కెటింగ్, ప్రసార హక్కుల ఒప్పందాలకు సంబంధించి ఫిఫా అధికారులు అవినీతికి పాల్పడినట్టు అభియోగాలు వచ్చాయి. అమెరికా విన్నపం మేరకు స్విస్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ కేసుపై దృష్టిసారించారు. కాగా ఫిఫా అధ్యక్షుడు సెప్ బ్లాటర్పై అభియోగాలు నమోదు చేయకున్నా అధికారులు ఆయనను విచారించనున్నారు.