భారత పుట్‌బాల్ అండర్–16 జట్టుకు సౌమ్య
Published Tue, Aug 23 2016 10:38 PM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ స్పోర్ట్స్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన గుగ్లోత్ సౌమ్య భారతపుట్‌బాల్ అండర్–16 జట్టుకు ఎంపికయ్యింది. ఈ మేరకు పుట్‌బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్గునా తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన భారత జట్టుకు ఇందూర్ జిల్లాకు చెందిన సౌమ్యనే ఎంపికైంది. గత సంవత్సరం కూడా అండర్–14 విభాగంలో సౌమ్య భారత జట్టుకు ఎంపికై నేపాల్‌లో జరిగిన టోర్నిలో తన ప్రతిభతో గోల్స్ సాధించింది. నేపాల్‌లో భూకంపం రావడం వల్ల పలు మ్యాచ్‌లు రద్దయ్యాయి. ఈ సంవత్సరం కూడా భారతజట్టుకు ఎంపిక కావడంపై జిల్లా పుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 28నుంచి సెప్టెంబర్ 5వరకు చైనాలో జరిగే ఏఎఫ్‌సీ పుట్‌బాల్ కప్‌లో పాల్గొననుంది. ఇప్పటికే స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ విభాగంలో నాలుగు సార్లు జాతీయస్థాయిలో, పుట్‌బాల్ అసోసియేషన్ తరపున ఐదుసార్లు జాతీయస్థాయిలో పుట్‌బాల్‌టోర్నిలో పాల్గొని సత్తా చాటింది. జిల్లా కేంద్రంలోని రాఘవస్కూల్‌లో 10వ తరగతి పూర్తి చేసి, ప్రస్తుతం ఎస్‌ఆర్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి, తల్లి గృహిణి. కోచ్ నాగరాజు పుట్‌బాల్ శిక్షణలో జిల్లా నుంచి అంతర్జాతీయస్థాయికి ఎదిగింది.
Advertisement
Advertisement