Ram Gopal Varma Interesting Tweet On Karthikeya 2 Movie Success - Sakshi
Sakshi News home page

Ram Gopal Varma: కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక

Published Sun, Aug 21 2022 12:57 PM | Last Updated on Sun, Aug 21 2022 2:23 PM

Ram Gopal Varma Interesting Tweet On Karthikeya 2 Movie Success - Sakshi

ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన ‘కార్తికేయ 2’ చిత్రం ఇండియన్‌ బాక్సాఫీసును షేక్‌ చేస్తోంది. ముఖ్యంగా బి-టౌన్‌ థియేటర్లపై ఈ మూవీ దండయాత్ర చేస్తోంది. అక్కడి స్టార్‌ హీరో సినిమాలను సైతం వెనక్కి నెట్టి భారీగా వసూళ్లు చేస్తోంది. కేవలం 50 థియేటర్లలో మాత్రమే రిలీజ్‌ అయిన ఈ చిత్రం ప్రస్తుతం అక్కడ మూడు వేలకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆమిర్‌ ఖాన్‌ లాల్‌ సింగ్‌ చడ్డా, అక్షయ్‌ కుమార్‌ రక్షా బంధన్‌ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో థియేటర్‌ నిర్వాహకులు ఈ సినిమాలు ఆపేసి కార్తికేయ 2ను రన్‌ చేస్తున్నారు.

మొత్తంగా వారం రోజులు గడిచేసరికి ఈ మూవీ రూ.60.12 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ 2 ఊహించని బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకోవడంతో సినీ విశ్లేషకులు, ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. తాజాగా కార్తికేయ 2 భారీ విజయంపై సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేస్తూ ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీయఫ్‌ 2 సినిమాల కంటే కార్తికేయ 2 బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అంటూ క్రేజీ కామెంట్స్‌ చేశాడు.

‘హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రెండవ శుక్రవారం రోజున అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే డబుల్ కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ కేజీయఫ్‌ 2 కంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీంతో బాలీవుడ్‌ హీరోకలు చురక పెడుతూ వర్మ చేసిన కామెంట్స్‌ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కాగా దర్శకుడు చందూ ముండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈచిత్రంలో వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి కీ రోల్‌ పోషించారు. కాల భైరవ సంగీతం అందించాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement