టాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో కబాలి నిర్మాత కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేసి ఆయన ఫోన్ డేటాను సేకరించారు. అందులో అతడు ఓ హీరోయిన్‌తో పాటు అషూ రెడ్డి, సురేఖా వాణి, ఆమె కూతురితో కలిసి దిగిన ఫోటోలు, వారితో సంభాషణలు జరిపినట్లుగా వందలాది ఫోన్ కాల్స్ ఉన్నాయి. వీరితో పాటు బడాబాబులు కూడా ఆయన జాబితాలో ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాలపై హీరో నిఖిల్ సిద్దార్థ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
శనివారం హైదరాబాద్‌లో రాష్ట్ర మాదక ద్రవ్యాల నిరోధక శాఖ విభాగం పోలీసులు ఏర్పాటు చేసిన 'పరివర్తన' కార్యక్రమానికి నటుడు ప్రియదర్శితో కలిసి నిఖిల్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొంతమంది సిగరెట్ తాగమని ఆఫర్ చేశారు. మరికొందరైతే చాలాసార్లు డ్రగ్స్ తీసుకోమని అడిగారు. కానీ ఒక్కసారి దానికి అలవాటు పడితే జీవితంలో మంచి రోజులు అనేవే ఉండదు. జీవితం సర్వనాశనమవుతుంది. అలాంటివాటికి నేను ఎప్పుడూ దూరంగా ఉంటాను. ప్రతి ఒక్కరూ ఇదే పని చేయాలి.
ముఖ్యంగా విద్యార్థుల జీవితం ఎంతో అందమైనది. డ్రగ్స్ అంటే జీవితానికి చరమగీతం పాడటమే! అది దృష్టిలో పెట్టుకుని దానికి దూరంగా ఉండండి. సరదాగా పార్టీలకు వెళ్లినా దయచేసి డ్రగ్స్ తీసుకోవద్దు. త్వరలోనే రాష్ట్రం మాదక ద్రవ్యాల రహిత తెలంగాణగా మారాలని కోరుకుంటున్నా' అన్నాడు నిఖిల్.
చదవండి: చైతూను మెచ్చుకోవాల్సిందే, సమంతలో ఆ క్వాలిటీ నచ్చుతుంది: శోభిత
Comments
Please login to add a commentAdd a comment