సామాజిక వేదికల్లో అల్లు అర్జున్‌కు సంఘీభావం..
అధికారులకు నాలుగు ప్రశ్నలు..
1. పుష్కరాలు, బ్రహ్మోత్స వాల్లాంటి కార్యక్రమా ల్లో తోపులాట జరిగి భక్తులు చనిపోతే దేవుళ్ల ను అరెస్ట్ చేస్తారా?
2. ఎన్నికల ప్రచారాల తొక్కిసలాటలో ఎవ రైనా చనిపోతే నేతలను అరెస్ట్ చేస్తారా?
3. సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్లో ఎవరైనా చని పోతే హీరో, హీరోయిన్లని అరెస్ట్ చేస్తారా?
4. భద్రతా ఏర్పాట్లను పోలీసులు, నిర్వాహ కులు తప్ప సినిమా హీరోలు, ప్రజా నాయకులు ఎలా కంట్రోల్ చెయ్యగలరు?
– ఎక్స్‌లో దర్శకుడు రాంగోపాల్ వర్మ
అల్లు అర్జున్ హార్డ్‌వర్క్‌తో ఎదిగిన స్టార్
పబ్లిక్ ర్యాలీల్లో, పలు ఘట నల్లో తొక్కిసలాటలు జరిగి ఎందరో అమాయ కులు చనిపోయారు. వారి జాబి తా కోసం వెతుకుతున్నా. ఈ మధ్యకాలంలో ఓ యంగ్ యాక్టర్ తొక్కి సలాటలో అసౌకర్యానికి గురై, కార్డియాక్ అరె స్ట్‌తో చనిపోయారు. అల్లు అర్జున్ హార్డ్‌వర్క్ తో ఎదిగిన స్టార్.. వారస త్వంతో కాదు. – పూనమ్ కౌర్, నటి
నమ్మలేకపోతున్నాను
ఇప్పుడు నేను చూస్తున్న పరిణామాలను నమ్మలేక పోతున్నాను (అల్లు అర్జున్ అరెస్ట్‌ని ఉద్దేశించి). జరి గిన ఘటన చాలా బాధాకరం.. దురదష్టకరం. అయితే అందుకు ఒక వ్యక్తిని నిందించడం మాత్రం చాలా బాధగా ఉంది. ఈ ప్రస్తుత పరిస్థితి చాలా బాధాకరం.. – రష్మిక మందన్నా, నటి
ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదు
ప్రభుత్వ అధికారులు, మీ డియా వారు సినిమా పరి శ్రమకు సంబంధించిన వా ళ్లపై చూపించే ఉత్సాహం సాధారణ ప్రజల విషయంలోనూ చూపించాలని కోరుకుంటున్నాను. దీని నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్చు కోవాలి. మరిన్ని జాగ్రత్తలు పాటించి భవిష్య త్‌లో ఇలాంటి ఘటనలు జరుగకుండా చూసు కోవాలి. ఇక్కడ మనందరి తప్పు ఉంది. ఒక వ్యక్తిని నిందించటం సరికాదు. – నాని, సినీ నటుడు
ఒక్కరినే నిందించటం సరికాదు
జరిగిన ఘటన హృదయ విదారకం. ఇలా జరిగి ఉండాల్సింది కాదు. ఒక నటుడు భద్రతాపరమైన చర్యలకు పూర్తి బాధ్యత వహించలేడు. ఈ ఘటనకు ఒక వ్యక్తినే బాధ్యుణ్ణి చేసి, నిందించడం సరికాదు. – వరుణ్ ధావన్, సినీ నటుడు
అందరూ బాధ్యులే
నేను అల్లు అర్జున్‌కు గొప్ప మద్దతుదారును. జరిగిన ఘటన దురదృష్టకరం. మనం హైప్రొఫైల్ వ్యక్తు లం. ఇలాంటి పరిణామాలకు బాధ్యులుగా మారకూడదు. ప్రజల ప్రాణాలు ఎంతో విలు వైనవి. ఇలాంటి ఘటనలకు అందరూ బాధ్యత వహించాలి. – కంగనా రనౌత్, సినీనటి, ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment