హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌ | Allu Arjun Approached The High Court Over Sandhya Theatre Incident | Sakshi
Sakshi News home page

Allu Arjun: హైకోర్టును ఆశ్రయించిన అల్లు అర్జున్‌

Published Wed, Dec 11 2024 7:49 PM | Last Updated on Wed, Dec 11 2024 8:02 PM

Allu Arjun Approached The High Court Over Sandhya Theatre Incident

హీరో అల్లు అర్జున్‌ హైకోర్టును ఆశ్రయించాడు. హైదరాబాద్‌ ఆర్జీసీ క్రాస్‌ రోడ్స్‌లో సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో భాగంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్‌ దాఖలు చేశాడు. డిసెంబర్‌ 4న పుష్ప 2 ప్రీమియర్స్‌ సందర్భంగా సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరగ్గా ఓ మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు సంధ్య థియేటర్‌ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్‌పైనా కేసు నమోదు చేశారు.

నిర్లక్ష్యం!
అల్లు అర్జున్‌ థియేటర్‌కు వస్తున్న విషయాన్ని పోలీసులకు ముందుగా తెలియజేయడంలో అలసత్వం వహించడంతోపాటు భద్రత విషయంలోనూ నిర్లక్ష్యం వహించా​రంటూ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే బన్నీ.. తనపై చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన కేసు కొట్టివేయాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement