Anupama Parameswaran Talk About Karthikeya-2 Movie - Sakshi
Sakshi News home page

Anupama Parameswaran : 'ఈ సినిమా కోసం వేరే ప్రాజెక్ట్స్‌ వదులుకున్నాను'.. 

Published Mon, Aug 15 2022 9:06 AM | Last Updated on Mon, Aug 15 2022 10:36 AM

Anupama Parameswaran About Karthikeya-2 Movie - Sakshi

‘‘కార్తికేయ 2’ చూసినవారు బాగుందని చెప్పడం హ్యాపీగా ఉంది. నా పాత్రకు మంచి స్పందన వస్తోంది. అది మంచి ఎనర్జీ ఇచ్చింది’’ అన్నారు    అనుపమా పరమేశ్వరన్‌. చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘కార్తికేయ 2’. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమా శనివారం విడుదలైంది.

ఈ  సందర్భంగా అనుపమా పరమేశ్వరన్‌ మాట్లాడుతూ– ‘‘చందూగారు ఈ చిత్రకథ చెప్పినప్పుడు ఎగ్జయిట్‌ అయ్యాను. ‘కార్తికేయ 2’లో కృష్ణ తత్త్వం కాన్సెప్ట్‌ నాకు బాగా నచ్చింది.. అందుకే ఈ చిత్రం కోసం కొన్ని ప్రాజెక్ట్స్‌ను వదులుకున్నాను. కొన్ని చోట్ల హీరోను డామినేట్‌ చేసేలా నా పాత్ర ఉంది అనడంలో వాస్తవం లేదు.. కథకు తగ్గట్టుగానే నా పాత్ర ఉంది. ‘రౌడీ బాయ్స్‌’లో కథ డిమాండ్‌ మేరకే ముద్దు సీన్స్‌లో నటించాను. ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాను’’ అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement