
యంగ్ హీరో నిఖిల్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ఒకటి. దానికి సీక్వెల్‌గా వస్తోందే కార్తికేయ 2. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 12న రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు. కానీ అదేరోజు నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా విడుదలవుతుండటంతో నిఖిల్ ఓ మెట్టు వెనక్కు తగ్గాడు. ఒకరోజు ఆలస్యంగా అంటే ఆగస్టు 13న కార్తికేయ 2 విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా బుధవారం జరిగిన మీడియా సమావేశంలో హీరో నిఖిల్ మాట్లాడుతూ.. 'కంటెంట్‌ను బట్టే నా సినిమాల విడుదల ఉంటుంది. కార్తికేయ 2, స్పై సినిమాలకు ఆ సత్తా ఉంది కాబట్టే పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నాము.
సినిమా విడుదల తేదీ మారడమనేది ఒక మిస్టరీ అయింది. రిలీజ్ క్లాష్ లేకుండా ఉండాలని నిర్మాతలు నిర్ణయించారు. అందులో భాగంగానే నా సినిమా రిలీజ్ డేట్ మారుతూ వచ్చింది. నాకు పార్టీలు ముఖ్యం కాదు, వ్యక్తులే ముఖ్యం. నటులకు పార్టీలతో పని లేదు. మంచి ఎవరు చేసినా నటులుగా మేము అభినందిస్తాము' అని చెప్పుకొచ్చాడు.
The Mystical Adventure #Karthikeya2 hits the big screens on August 13th 💥#Karthikeya2OnAug13 🔥#KrishnaIsTruth@actor_Nikhil @anupamahere @AnupamPKher @chandoomondeti @vishwaprasadtg @AbhishekOfficl @vivekkuchibotla @MayankOfficl @peoplemediafcy @AAArtsOfficial pic.twitter.com/XchDYB3Kad
— Abhishek Agarwal Arts (@AAArtsOfficial) August 3, 2022
చదవండి: స్టార్ హీరోకు ఇల్లు అమ్మేసిన జాన్వీ? ఎన్ని కోట్లో తెలిస్తే షాకవ్వాల్సిందే!
డ్రెస్సింగ్‌పై ట్రోల్.. తనదైన స్టైల్లో నెటిజన్ నోరుమూయించిన బిందు
Comments
Please login to add a commentAdd a comment