Anupama Parameswaran Interesting Comments At Karthikeya 2 Success Meet - Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: ఆనందం కంటే బాధే ఎక్కువగా ఉంది: అనుపమ ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, Aug 17 2022 9:35 AM | Last Updated on Wed, Aug 17 2022 11:07 AM

Anupama Parameswaran Interesting Comments At Karthikeya 2 Success Meet - Sakshi

యంగ్‌ హీరో నిఖిల్ హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన లేటెస్ట్‌ మూవీ ‘కార్తికేయ 2’. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్‌ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ విడుదలైన తొలి షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇక కార్తీకేయ-2 మంచి విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం మంగళవారం సక్సెస్‌ మీట్‌ నిర్వహించింది.

చదవండి: స్పెయిన్‌లో జెండా ఎగురవేసిన నయనతార

ఈ సందర్భంగా హీరోయిన్‌ అనుపమ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా సక్సెస్‌ అయినప్పటికీ తాను ఆనందంగా లేనంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘నాకేప్పుడు కూడా స్టేజ్ మీద ఇంత టెన్షన్ ఉండదు. ఈ రోజున స్టేజ్ పైకి వస్తుండగానే షివరింగ్ మొదలైంది. సినిమా హిట్ అయింది కదా.. నువ్వెందుకు హ్యాపీగా లేవని నా ఫ్రెండ్స్ అడుగుతున్నారు. ఈ సినిమా విజయం సాధించినప్పటికి కార్తీకేయ-2 జర్నీ అయిపోయిందనే బాధే నాకు ఎక్కువగా ఉంది.

చదవండి: రీ-రిలీజ్‌కు ముస్తాబవుతున్న చిరు, పవన్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలు!

ఆ బాధవల్లే నేను ఈ హిట్‌ను ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఇలాంటి ఒక మంచి సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు.. నన్ను భరించినందుకు చందూ మొండేటి గారికి, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు, వాళ్ల  వరకు ఈ సినిమాను తీసుకెళ్లిన మీడియాకు కృతజ్ఞతలు’ తెలిపింది. ఇక హీరో నిఖిల్‌ మాట్లాడుతూ.. కార్తీకేయ-2 ఇంతటి విజయం సాధిస్తుందని మేం ఊహించలేదు. అంతట హౌజ్‌ఫుల్స్‌ పడుతున్నాయి. పూర్తిగా మౌత్‌ టాక్‌తోనే సినిమా జనాల్లో ఆదరణ దక్కించుకుంటోంది’ అని అన్నాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement