Anupama Parameswaran Comments On Karthikeya 2 Promotions, Post Goes Viral - Sakshi
Sakshi News home page

Anupama Parameswaran: కార్తికేయ 2 ప్రమోషన్స్‌కు బ్యూటీ డుమ్మా? ఎందుకంటే?

Published Mon, Aug 1 2022 6:48 PM | Last Updated on Mon, Aug 1 2022 8:08 PM

Anupama Parameswaran About Karthikeya 2 Promotions - Sakshi

సినిమాను తెరకెక్కించడమే కాదు.. దాన్ని అనువైన సమయం చూసుకుని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కూడా కష్టమైన పనే. ఏ సినిమాలతో క్లాష్‌ కాకుండా సరైన తేదీ చూసుకుని రిలీజ్‌ చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఎన్నో గండాలను దాటుకుని కార్తికేయ 2 ఆగస్టు 12న విడుదల కాబోతోంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిఖిల్‌ హీరోగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. సినిమా రిలీజ్‌కు మరో 10 రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ల స్పీడు పెంచింది చిత్రయూనిట్‌. అయితే ఈ ప్రమోషన్స్‌కు హీరోయిన్‌ అనుపమ డుమ్మా కొడుతోంది. సడన్‌గా అనుపమ ప్రమోషన్స్‌కు ఎందుకు హ్యాండ్‌ ఇచ్చిందబ్బా? అని నెటిజన్లు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. తాజాగా దీనిపై అనుపమ స్పందించింది.

'కార్తికేయ 2 మూవీ ప్రమోషన్స్‌కు నేను ఎందుకు రాలేకపోతున్నానో మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను మరో రెండు సినిమాలకోసం పగలనకా రాత్రనకా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాను. ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్‌ సన్నివేశాలను ఎప్పుడో షెడ్యూల్‌ చేశారు. మరోవైపు కార్తికేయ 2 ప్రమోషన్స్‌కు నేను ప్లాన్‌ చేసుకున్నా. కానీ సినిమా విడుదల చాలాసార్లు వాయిదా పడటంతో షెడ్యూల్‌ మొత్తం తారుమారైంది. కాబట్టి ఇక్కడ డుమ్మా కొట్టలేని పరిస్థితి. నా బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. కార్తికేయ 2 టీమ్‌, మరీ ముఖ్యంగా ఎంతగానో కష్టపడుతున్న నిఖిల్‌గారికి నా ప్రేమాభివందనలు' అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చిందీ మలయాళ బ్యూటీ.

చదవండి: అందుకే అమ్మ ఆత్మహత్య చేసుకుంది: దీక్షిత
పబ్లిక్‌గా బిగ్‌బాస్‌ కంటెస్టెంట్ల లిప్‌లాక్‌! వీడియో వైరల్‌?.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement