Karthikeya 2: Nikhil Siddharth Doing Karthikeya Movie Promotions In Zee Telugu TV Serial - Sakshi
Sakshi News home page

Nikhil: సీరియల్‌లో నిఖిల్‌ ఎంట్రీ.. మామూలుగా ప్లాన్‌ చేయలేదట!

Published Sat, Jul 23 2022 9:28 PM | Last Updated on Sun, Jul 24 2022 12:09 PM

Karthikeya 2: Nikhil Siddharth Doing TV Serial - Sakshi

సినిమా ప్రమోషన్‌ కోసం ఏం చేయడానికైనా రెడీ అంటున్నారు హీరోలు. తాజాగా హీరో నిఖిల్‌ సీరియల్‌లో ప్రత్యక్షమయ్యాడు. కార్తికేయ 2 సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుల్లితెరపై సందడి చేశాడు. జీ తెలుగులో ప్రసారమయ్యే ఓ సీరియల్‌లో ఎంటరై సడన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ప్రస్తుతం సీరియల్‌లో పెళ్లి తతంగం జరుగుతోంది.

అయితే ఈ పెళ్లికి నిఖిల్‌ హాజరవ్వడమే కాకుండా ఓ చిన్న ఫైట్‌ కూడా చేసినట్లు తెలుస్తోంది. పైగా కార్తికేయ 2 మూవీని  గుర్తు చేసేలా సీరియల్‌ డైరెక్టర్‌ నిఖిల్‌ కనిపించే స్పెషల్‌ ఎపిసోడ్‌ను అదిరిపోయేలా ప్లాన్‌ చేశాడట. ఈ విషయాన్ని నిఖిలే స్వయంగా వెల్లడించాడు. 'సీరియల్‌ షూటింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అద్భుతంగా ఉంది. నన్ను చాలా బాగా చూసుకున్నారు. చాలా మంచి సీన్‌ రాశారు' అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. మొత్తానికి ఈ సీరియల్‌ ప్రమోషన్‌ ఎంతమేరకు వర్కవుట్‌ అవుతుందో చూడాలి! కాగా కార్తికేయ 2 ఆగస్టు 12న థియేటర్లలో విడుదల కానుంది.

చదవండి: డబ్బుంది కానీ సంతోషమే లేకుండా పోయింది: రజనీకాంత్‌
నేను మారిపోయా, నన్ను నేను కొత్తగా చూసుకుంటున్నా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement