‘ఆదిపురుష్’ విడుదలైన తర్వాత రెండు వారాల వరకు థియేటర్లో ప్రేక్షకులను రప్పించే సినిమాలు ఏవీ విడుదల కాలేదనే చెప్పవచ్చు. ‘ఆదిపురుష్’ ఎఫెక్ట్ వల్ల కొన్ని సినిమాలను వాయిదా కూడా వేసుకున్నారు. అందువల్ల గత వారంలో పెద్ద చిత్రాలేవి విడుదల కాలేదు. దాదాపు అన్ని చిన్న సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో ఏ ఒక్కటి కూడా సినీ ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ జూన్ 30న బాక్సాఫీస్ వద్ద మళ్లీ సందడి కొనసాగనుంది. ఈ వారం థియేటర్‌లోనే కాకుండా ఓటీటీలోనూ వెబ్‌సిరీస్‌లతో పాటు పలు కొత్త సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
నిఖిల్ హీరోగా పాన్ ఇండియా సినిమా 'స్పై' జూన్ 29న గురువారం విడుదల కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీతో పాటు ఆయన జీవితానికి సంబంధించిన ఎప్పుడూ వినని అంశాలతో సినిమాను తెరకెక్కించారు. నిఖిల్ ప్రధాన కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో ఆర్యన్ రాజేశ్, ఐశ్వర్య మేనన్, సన్యా ఠాకూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బి.హెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. కె.రాజశేఖర్‌రెడ్డి కథని సమకూర్చడంతోపాటు, ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై స్వయంగా నిర్మిస్తున్నారు.
శ్రీ విష్ణు హీరోగా 'వివాహభోజనంబు' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సామజ వరగమన'. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ చిత్రం జూన్ 29న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో చిరంజీవి విడుదల చేసిన విషయం తెలిసిందే. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆయన చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
2008లో 'ఇండియానా జోన్స్ అండ్ ది కింగ్‌డమ్ ఆఫ్ క్రిస్టల్ స్కల్' అప్పట్లో పెద్ద హిట్‌గా నిలిచింది. తాజాగా దాదాపు 14ఏళ్ల తర్వాత అదే సీరిస్‌లో 'ఇండియానా జోన్స్' కొత్త చిత్రం జూన్ 30న థియేటర్లోకి రాబోతోంది. అడ్వెంచర్ సినీ ప్రియులకు ఈ సినిమా పండుగే అని చెప్పవచ్చు.
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లోకి వచ్చే మూవీస్ ఇవే
డిస్నీ+హాట్‌స్టార్
• వీకెండ్ ఫ్యామిలీ (వెబ్‌సిరీస్) జూన్ 28
• ది నైట్ మేనేజర్ (సిరీస్2) జూన్30
నెట్ ఫ్లిక్స్
• లస్ట్ స్టోరీస్ 2 (హిందీ) జూన్ 29
• అఫ్వా (హిందీ) జూన్30
అమెజాన్ ప్రైమ్
• జాక్ ర్యాన్ (వెబ్‌సిరీస్ 4) జూన్ 30
థియేటర్లో
• నిఖిల్ 'స్పై' జూన్ 29
• 'ఇండియానా జోన్స్' జూన్ 29
• శ్రీ విష్ణు 'సామజ వరగమన' జూన్ 30
• 'లవ్ యూ రామ్' జూన్ 30
• పాయల్ రాజ్‌పుత్ 'మాయా పేటిక' జూన్ 30
ఆహా
• అర్థమయ్యిందా అరుణ్‌కుమార్ (తెలుగు సిరీస్) జూన్ 30
Comments
Please login to add a commentAdd a comment