
ఇస్లామాబాద్: భారతదేశంపై గూఢాచర్యానికి పాకిస్థాన్ భారీ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది. సుమారు 4.7 బిలియన్ రూపాయల ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలకు సిద్ధమైంది. వచ్చే ఏడాదికల్లా వాటి నిర్మాణం పూర్తి చేసి ప్రయోగించాలని పాక్ నిఘా వ్యవస్థ నిర్ణయించింది. ఈ మేరకు పాక్ రక్షణ నిపుణుడు మరియా సుల్తాన్ ఇంటర్వ్యూను డాన్ పత్రిక ప్రచురించింది.
‘భారత కదిలికలపై పాక్ ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది. ఇంత కాలం ఇండియా పరిమిత పరిధిలో ప్రయోగాలు చేసుకునేంది. కానీ ఈ మధ్య అమెరికా సహకారంతో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. ఈ సమయంలో పాక్ త్వరపడాల్సిన అవసరం ఉంది. విదేశీ శాటిలైట్లపై ఎంతో కాలం ఆధారపడలేం. అందుకే ఈ భారీ ప్రయోగానికి పాక్ రక్షణ రంగం సిద్ధమైంది’ అని మరియా పేర్కొన్నారు. దేశీయ సూపర్‌కో ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు.
పాక్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం తొలిదశలో రూ. 100 కోట్లు కేటాయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో మిగతా కేటాయింపులు ఉంటాయని తెలిపింది. ఈ మెగా ప్రాజెక్టులో మొత్తం నాలుగు శాటిలైట్లను రూపకల్పన చేయనున్నారు. అందులో పాక్ శాట్-ఎంఎం1 ఒక్కదాని కోసమే రూ. 135 కోట్లను కేటాయించగా... మిగతా మూడు శాటిలైట్ల కోసం రూ.255 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇదిగాక సుమారు రూ. 100 కోట్లతో కరాచీ, ఇస్లామాబాద్, లాహోర్‌లలో స్పేస్ సెంటర్‌లను ఏర్పాటు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment