అమెరికా గగనతలంలో చైనా స్పై బెలూన్ వ్యవహారం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. అమెరికా కూడా రక్షణ వ్యవస్థకు సమీపంలో ఆ స్పై బెలూన్ ఉందంటూ కూల్చివేసింది. ఈ ఘటన జరిగిన నాలుగు వారాల తర్వాత భారత గగనతలంపై కూడా ఈ స్పై బెలూన్ ప్రత్యక్ష్యం అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఈ మేరకు ఈ విషయాన్ని భారత రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. అదీకూడా అమెరికా గగనతలంలో ప్రత్యక్ష కావడానికి ముందే గతేడాది ఈ స్పై బెలూన్ భారత్ గగనతలంలో కనిపించినట్లు అధికారుల చెబుతున్నారు.
ఐతే తాము అది ఏమిటనేది గుర్తించలేకపోవడం, సరైన సమాచారం కూడా లేకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. గతేడాది అండమాన్ నికోబార్ దీవులు భూభాగంలోని గగనతలంపై ఈ స్పైబెలూన్‌ని చూసినట్లు అధికారులు పేర్కొన్నారు. వాటిని తాము వాతావరణ బెలూన్‌లుగా భావించామని, అదీగాక అలాంటి వాతావరణ బెలూన్‌లు గాలుల కారణంగా పాకిస్తాన్ వైపు నుంచి బారత్ గగనతలంలోకి వస్తుంటాయని చెప్పారు. పైగా ఆ బెలూన్ ఏంటి అని తెలుసుకునేలోపే సముద్ర గగనతలం వైపుకి వెళ్లిపోయినట్లు తెలిపారు.
ప్రస్తుతం అమెరికా చైనా నిఘా బెలూన్ వ్యవహారంతో తాము ఒక్కసారిగా అప్రమత్తమైనట్లు తెలిపారు. ఇక ఇలాంటి బెలూన్‌లు అండమాన్ లేదా మరే ఇతర ప్రాంతాల్లో కనిపించినా.. జాగ్రత్తగా పరిశీలించడమే గాక అది గూఢచర్యానికి చెందినదని తెలిస్తే కూల్చివేస్తామని చెప్పారు అధికారులు. ఆ నిఘా బెలూన్ కనిపించిన దీవులు భారత క్షిపణి పరీక్ష ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఒక్కసారిగా భారత రక్షణ వ్యవస్థ ఒక్కసారిగా అప్రమత్తమైంది.
(చదవండి: ఐక్యత శక్తి ఏంటో చూపించిన గొంగళిపురుగులు..హర్ష గోయెంకా ట్వీట్)
Comments
Please login to add a commentAdd a comment