
టెహ్రాన్ : ఇన్‌స్టాగ్రామ్ స్టార్‌గా పాపులర్ అయిన సహర్ తబారా కరోనా వైరస్ బారిన పడింది. 22 ఏళ్ల ఇరానియన్ స్టార్ అయిన ఈమె ప్రస్తుతం టెహ్రాన్‌లోని సినా ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై ఉంది. హాలీవుడ్ నటి ఏంజెలినీ జోలీలా తన రూపురేఖలను మార్చుకునేందుకు 50 కిపైగానే ఆపరేషన్లు చేయించుకుంది. అవి బెడిసికొట్టి ఉన్న అందం కాస్తా వికృతంగా తయారు అయింది. సోషల్ మీడియా స్టార్ సహార్ తబార్ అసలు పేరు ఫతేమే ఖిష్వండ్.
చూడటానికి వింతగా కనిపించే ఆమె ముఖాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేసిన తర్వాత ఒక్కసారిగా ఆమె పేరు వెలుగులోకి వచ్చింది. అయితే దైవదూషణ, హింసను ప్రేరేపించడం, యువకులను అవినీతికి ప్రోత్సహించడం, తగని మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందడం వంటి ఆరోపణలపై గతేడాది అక్టోబరులో తబార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్న ఆమెకు కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ కావడంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కరోనా వైరస్‌తో బాధపడుతున్నప్పటికీ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి నిరాకరించినట్టు ఇరాన్‌లోని మానవ హక్కుల సంఘం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment