మాటా ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
హాప్కిన్స్: బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాలను మిన్నెసోటా ఏరియా తెలంగాణ అసోసియేషన్(మాటా) హప్కిన్స్ లో ఈ నెల 8న ఘనంగా నిర్వహించింది. ఈ మేరకు మాటా ఓ ప్రకటన విడుదల చేసింది. హాప్కిన్స్ నగరంలోని హాప్కిన్స్ హైస్కూల్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ వేడుకలకు 800మందికి పైగా హాజరయైనట్లు తెలిపింది.
శనివారం మధ్యాహ్నం గణపతి పూజతో ప్రారంభమైన వేడుకలు సాంస్కృతిక కార్యకమాలతో ముగిసిందని నిర్వాహకులు తెలిపారు. 160 మంది అతిథులు భారతదేశం నుంచి ఈ వేడుకలకు హాజరైనట్లు వివరించారు. బతుకమ్మ కోలాటం, 23 గ్రూపులు ఇచ్చిన డ్యాన్స్ ప్రదర్శనలు వేడుకలకు హైలెట్ గా నిలిచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బతుకమ్మ కమిటీ, వాలంటీర్లు కవిత కపిడి, అశ్మిని గునుగంటి, మాలతి కూర, హారిక అర్ర, శివాని రాచర్ల, అనూష కదర్ల, శిరీష కాకుమాను, రజిత గీనుగలకు నిరంజన్ ధన్యవాదాలు తెలిపారు.
విద్యలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన నలుగురు విద్యార్ధలకు మాటాతో కలిసి మహిపతి ఫౌండేషన్ అవార్డులు ప్రధానం చేసింది. రాకేష్ కంజుల, ఆదిత్య తుర్లపాటిలు కలిసి మాటా-2016 చారిటీ వివరాలను వెల్లడించారు. ఈ ఏడాది మనమాటా-మనఊరు పేరుతో మారుమూల గ్రామాల్లో వసతులు కల్పించేందుకు మాటా నడుంబిగించింది. జీడికల్లు జెడ్ పీపీఎస్ఎస్, లింగాల ఘాన్ పూర్ మండలాల్లో స్కూళ్లకు మౌలిక వసతులను కల్పించింది.
ఈ సందర్భంగా 2017 బోర్డు మెంబర్లు ప్రెసిడెంట్: నిరంజన్ అల్లంనేని, ఉపాధ్యక్షుడు: సక్రూ నాయక్, ప్రధాన కార్యదర్శి: శ్రీనివాస్ గడ్డం, జాయిట్ సెక్రటరీ: రాజా ముదిగంటి, ట్రెజరర్: రమేష్ కోమాకుల తదితరులను ప్రేక్షకులకు మాటా ప్రస్తుత చైర్మన్ మహేందర్ గింగువా పరిచయం చేశారు. ఈ కార్యక్రమానికి మహిపతి ఫౌండేషన్ చైర్మన్ నాగేందర్ మహిపతి, హిందూ టెంపుల్ ఆఫ్ మిన్నెసోటా చైర్మన్ అక్షయ పండా, తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ హరిత చిమటలు హాజరయ్యారు.
వేడుకలు విజయవంతకావడానికి కృషి చేసిన మాటా బోర్డు ఉపాధ్యక్షులు నిరంజన్ అల్లంనేని, జనరల్ సెక్రటరీ రాకేష్ కంజుల, జాయింట్ సెక్రటరీ సక్రూ నాయక్, ట్రెజరర్ బుచ్చిరెడ్డి ముదిరెడ్డి, బోర్డు మెంబర్లు రమేశ్ కోమాకుల, రాజశేఖర్ బాచిగారి, సారథి తాళ్ల, శ్రీనివాస్ గడ్డం, యుగంధర్ పట్టూరి, నాగేందర్ నెళ్లా, రాజా ముదిగంటి, భవానీ రాం చెప్పుకూరి, రాజ్ కుమార్ కౌకోటి, అశ్విని గునుగంటి, శ్రీనివాస్ బాచిగారి, శివాని రాచర్ల, మాలతి కూర, అనుష కాదర్ల, కవిత కపిడి, ఆదిత్య తుర్లపాటి, శ్రీపాద్ దేవరాజు, అమర్ చిన్నోల, రవి భీమ, మురళి లక్కరాజులను మాటా బోర్డు చైర్మన్ మహేందర్ గింగువా అభినందించారు.