
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) దశాబ్ద వేడుకలు డిసెంబర్‌లో జరగనున్నాయి. ఈ వేడుకలో టీటీఏ తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలను ప్రదర్శస్తుందని టీటీఏ అధ్యక్షుడు మలిపెద్ది నవీన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఒకప్పటి ఐక్య ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తరువాత, తెలంగాణ సాంస్కృతిక వైభవం, సంప్రదాయాలు, కళలను సంరక్షించడం, ప్రోత్సహించడం వంటివి జరిగాయన్నారు.
అదే దార్శనికతో యూఎస్‌ఏలో డాక్టర్ పైలా మల్లారెడ్డి నాయకత్వంలో టీటీఏ స్థాపించినట్లు పేర్కొన్నారు. గత పదేళ్లుగా టీటీఏ వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించడానికే నిరాటంకంగా పనిచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఈ అసోసీయేషన్ దశాబ్దం పూర్తి చేసుకుంటున్నందున ఈ వేడుకలకు ప్లాన్ చేసినట్లు తెలిపారు.
అలాగే ఈ వేడుకల్లో భాగంగా డిసెంబర్ రెండోవారం టీటీఏ సేవా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో తెలంగాణ అంతటా పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించడం వంటివి జరుగుతాయని అన్నారు. ఈ సంఘం ప్రవాస తెలంగాణవాసులు (NRI)లు తమ మాతృభూమికి వివిధ మార్గాలలో తోడ్పడాలని ప్రోత్సహించడమే గాక ఎంతో కొంత తిరగి ఇవ్వాలనే సందేశాన్ని అందిస్తుందని చెప్పుకొచ్చారు.
ఈ వేడుకుల సందర్భంగా హైదరాబాద్‌లో తెలంగాణ సాంస్కృతిక మేథో వారసత్వాన్ని సుసంపన్నం చేయడంలో కృషి చేస్తున్న కళాకారులు, నటులు, వివిధ రంగాల నిపుణులు, శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులు తదితరాలని సత్కరిస్తారు. ఈ దశాబ్ద వేడుకల సమావేశం 2026 మే, జూనలో యూఎస్‌ఏలో జరుగునుందని టీటీఏ పేర్కొంది. అంతేగాదు ఈ గ్రాండ్ ఈవెంట్‌లో తెలంగాణ సంస్కృతిని గణనీయంగా ప్రభావితం చేసే ప్రముఖ వ్యక్తులకు కూడా ప్రత్యేక గౌరవాలు ఉంటాయని స్పష్టం చేసింది.
(చదవండి: టెక్సాస్‌లో సామాజిక బాధ్యత పెంచేలా నాట్స్ అడాప్ట్ ఏ స్ట్రీట్ కార్యక్రమం..!)
Comments
Please login to add a commentAdd a comment