
సాక్షి,అనంతపురం: కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను అమలు చేయాలని సీపీఐ,సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు,కార్మికులు అనంతపురం జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన కలెక్టర్ వినోద్‌కుమార్ వాహనాన్ని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
ఆందోళకారులు కలెక్టర్ వాహనాన్ని అరగంట సేపు దిగ్భందించారు.ఈ సందర్భంగా పోలీసులు,ఆందోళకారులకు మధ్య వాగ్వాదం,తోపులాటజరిగింది. హామీల అమలులో టీడీపీ,బీజేపీ, జనసేన విఫలమయ్యాయని సీపీఎం నేతలు మండిపడ్డారు. చంద్రబాబు కు రైతుల ఆత్మహత్యలు పట్టవా అని వారు ప్రశ్నించారు.
రైతు భరోసా పథకం కింద ఒక్కో రైతుకు 20 వేల రూపాయల ఆర్థిక సాయం ఎందుకివ్వలేదో చెప్పాలని నిలదీశారు.వైఎస్సార్ వాహనమిత్ర ఇవ్వకపోవడం వల్ల ఆటో,ట్యాక్సీ డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:
Andhra Pradesh: ఆందోళనలతో అట్టుడికిన రాష్ట్రం