ఆ అటెండర్‌ అంధుడే.. కానీ పనిలో మాత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్ | Kurnool Collectorate Attendant Blind Madhu Inspirational Story | Sakshi
Sakshi News home page

ఆ అటెండర్‌ అంధుడే.. కానీ పనిలో మాత్రం మిస్టర్ పర్‌ఫెక్ట్

Published Fri, Dec 10 2021 6:08 PM | Last Updated on Fri, Dec 10 2021 7:39 PM

Kurnool Collectorate Attendant Blind Madhu Inspirational Story - Sakshi

సాక్షి,కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మధు. పుట్టుకతోనే అంధుడు. కలెక్టరేట్‌లోని సీపీఓ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఇతను విధుల నిర్వహణలో పర్‌ఫెక్ట్‌ అండ్‌ షార్ప్‌. కొన్ని సందర్భాల్లో కళ్లున్న అటెండర్లు ఫైల్‌ ఎక్కడ పెట్టారో మర్చిపోవచ్చు కానీ మధు మాత్రం మరచిపోడు. మధు డ్యూటీలో ఉన్నాడంటే పైఅధికారులు అడిగిన తక్షణం ఫైల్‌ టేబుల్‌పై ఉంటుంది. కార్యాలయం ఉద్యోగులు ఎవరు ఏ ఫైల్‌ అడిగినా క్షణాల్లో అతని టేబుల్‌ మీదకు చేరుస్తాడు.

కళ్లు కనబడని వ్యక్తి విధులు ఎలా నిర్వర్తిస్తారని పలువురు ఆశ్చర్యపడుతున్నారు. కళ్లు కనిపించని వారికి మనోనేత్రం ఉంటుందనడానికి మధుయే సమాధానం. ఏది ఏమైనా సకలాంగులు చేయలేని పని మధు చేస్తున్నందున అతనికి పలువురు హాట్సాప్‌ చెబుతుండటం విశేషం.

చదవండి: ఎందరికో ఆదర్శం ఈ పట్టభద్రుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement