జేసీ2 కమలకుమారికి గతంలో తాను మాట్లాడిని విషయాన్ని సెల్ ద్వారా వినిపిస్తున్న ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు(పొగతోట):జిల్లా అధికారులు, అధికారపార్టీ నాయకుల ఉడత బెదిరింపులకు బెదిరే వ్యక్తి ని కాదని వైఎస్సార్‌సీపీ నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జేసీ 2 కమలకుమారిని ఎమ్మెల్యే కలసి జిల్లా అధికారులు ఇచ్చిన పత్రికా ప్రకటనకు సంబం ధించి సాక్ష్యాలు చూపించారు. నిరాధారమైన ఆరోపణలు చేశారని అధికారులు ఇచ్చిన ప్రకటనకు ప్రతి అంశానికి సంబంధించి ఆధారాలను జేసీ2కి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కాకాణి మాట్లాడుతూ ‘నేను అడిగిన దానికి జిల్లా అ ధి కారులు ఇచ్చిన సమాధానాలకు పొంతన లేదు.. నేను ఒకటి అడిగితే వారు మరొకటి చూపించి ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు అవాస్తవని పత్రికా ముఖంగా ప్రకటిస్తే ప్రజ లు ఏమనుకుంటారు’ అని జేసీ2ని ప్రశ్నించారు. కలెక్టర్ టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని ఆ రోపించారు. టీడీపీ నాయకులకు కలెక్టర్ కొమ్ముకాస్తున్నారన్నారు. జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న నిర్ణయాల వలన పాలన కుంటుపడుతోందన్నా రు. ‘నేను చేసిన విమర్శలకు సంబంధించి ఎటువంటి చర్యలు తీ సుకోకుండా టీడీపీ నాయకులను, జిల్లా అధికారులను నాపైకి ఎదురుదాడికి దిగేవిధంగా కలెక్టర్ ఉసిగొల్పారు’ అని పేర్కొన్నారు.
ఇది ఎంత వరకు సబబని ప్రశ్నిం చారు. పసుపు కుంభకోణంలో జిల్లా కలెక్టర్ అధికారపార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరించారన్నారు. వీఆర్‌ఓలను సస్పెండ్ చేసి అధికారపార్టీ నాయకులను వదిలేశారన్నారు. పసుపు కుంభకోణానికి సంబంధించి రికవరీ చేయలేదన్నారు. తమకు అనుకూలంగా పనులు చేయమని టీడీపీ నాయకులు కిందిస్థాయి ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారన్నారు. తప్పు చేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకునే కలెక్టర్.. అధికారపార్టీ నాయకులకు ఎందుకు కొమ్ముకాస్తున్నారని ప్రశ్నించారు. రామదాసుకండ్రిగకు సంబంధించి పట్టాల్లో పేర్లు మార్పు చేసి మంత్రి సంతకంతో అధికారులకు చేరిందన్నారు. దీనిపై పేర్లు మార్పునకు సంబం ధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేశామన్నారు. దానిని పక్కన పెట్టి రామదాసుకండ్రిగకు సంబంధించి ఎవరికీ నష్టపరిహారం ఇవ్వలేదని అధికారులు వివరణ ఇచ్చారన్నారు. ప్రొటోకాల్ పాటించడంలేదని అధికారులకు ఫిర్యాదు చేస్తే తనపై విమర్శలు చేశారన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కుమారుడు ఏ హోదాలో అధికార కార్యక్రమాలకు హాజరవుతున్నారని ప్రశ్నించారు. మంత్రి కుమారుడు కార్యక్రమాలకు అధికారులు ఏ విధంగా హాజరవుతున్నారన్నారు. ఈ విషయాలపై ప్రశ్నిస్తే నాపై ఎదురుదాడికి దిగుతున్నారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో నిర్వహించే అధికార కార్యక్రమాలకు స్థానిక ఎమ్మెల్యేను ఎందుకు ఆహ్వానించడం లేదని ప్రశ్నించారు. మంత్రి తన సొంత డబ్బన్నట్లు లబ్ధిదారులను, అధికారులను గెస్ట్‌హౌస్‌కు పిలిపించుకుని చెక్కులు ఏ వి«ధంగా పంపిణీ చేస్తారని నిలదీశారు.
ఇలాంటి విషయాలను ప్రశ్నిస్తే తాను జిల్లా కలెక్టర్‌పై అనుచితంగా మాట్లాడుతున్నానని అధికా రుల చేత ఎదురుదాడి చేయిస్తారన్నారు. పంచా యతీ కార్యాలయంలో తనను ఐదు గంటల అక్కడే ఓ అధికారి కుర్చోపెట్టి ఆయన ఎక్కడికో పోతే.. అధికారిని నేను బంధించారని ప్రచారం చేస్తారన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమాలో రూ. కోట్ల అవినీతి జరిగిందన్నారు. గ్రామాలు కంపు కొడుతున్నాయన్నారు. స్వచ్ఛభారత్‌లో జిల్లాకు అవార్డు తీసుకొచ్చిన కలెక్టర్ నిర్మల్ గ్రామీణ పురస్కారం ఒక్క మండలానికి ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. స్వచ్ఛభారత్ అవార్డు వచ్చిన సందర్భంగా టీడీపీ కార్యకర్తలకంటే అధికంగా ఫ్లెక్సీలు కలెక్టర్ వేయించుకోవడం సబబుగా ఉందా అని ప్రశ్నిం చారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల్లో న్యాచురల్ లీడర్లు దోచుకుతున్నారన్నారు. దానికి సం బంధించిన వారిని వదిలేసి ఉద్యోగులపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. పంచాయతీల్లో అక్రమాలు జరిగాయని కలెక్టర్‌కు ఏడాది కిందట ఫిర్యాదు చేస్తే ఇంత వరకు చర్యలు తీసుకోలేదన్నారు.
వైఎ స్సార్‌సీపీకి సంబంధించిన సర్పంచ్‌లపై మాత్రం వెంటనే చర్యలు తీసుకుంటున్నారన్నారు. వీటిని ప్రశ్నించినందుకు తనపై ఎదురుదాడిగా ఎమ్మెల్యేవి నిరాధారమైన ఆరోపణలని సమాధానం ఇస్తారా అని ప్రశ్నించారు. గతంలో ఉద్యోగులపై కలెక్టర్ చర్యలకు పూనుకుంటే వారికి అండగా నిలిచానని, ఈ విషయాన్ని వారు మరిచి పోయారన్నారు. అధికా రులను కలెక్టర్ తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. నేను వ్యక్తిగత విషయాలు, పనులు చేసి పెట్టమని కలెక్టర్, అధికారుల వద్దకు ఎప్పుడూ వెళ్లలేదన్నారు. ప్రజల సమస్యలపై మా త్రమే అధికారులను కలిశానని తెలిపారు. ప్రతి పక్ష శాసనసభ్యుని విషయంలో మంత్రి సోమిరెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారని చెప్పారు. కలెక్టర్ అధి కారపార్టీకి అండగా ఉండకుండా ప్రజల ప్రయోజనాల కోసం కృషి చేయాలని తెలిపారు. తాను చేసిన ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాల ను, సాక్ష్యాలను అధికారులకు అందజేశా ను.. ఏమి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ప్ర శ్నిం చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ పి.శిరీషా, వెంకటాచలం జెడ్పీటీసీ సభ్యుడు ఎం.వెంకట శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment