తమిళనాడులోని తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయం ఎదుట దారుణం చేసుకుంది. కలెక్టర్ తమ విన్నపం పట్టించుకోవటం లేదంటూ సోమవారం ఉదయం ఒక కుటుంబం నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడంతో కలకలం రేగింది. ఎన్నిసార్లు విన‍్నవించినా కలెక‍్టర్ తమ సమస‍్యను పరిష‍్కరించడం లేదన‍్న ఆగ్రహంతో, ఆవేదనతో కలెక‍్టరేట్ ఆవరణలో ఇసక్కిముత్తు, ఆయన భార్య సుబ్బలక్ష్మి, వారి కుమార్తెలు మదు శరణ్య, అక్షయ పూర్ణిమ కిరోసిన్ పోసుకుని నిప‍్పంటించుకుని ఆత‍్మహత‍్యయత్నానికి పాల‍్పడ్డారు.