అనంతపురం అర్బన్ : సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ జి.వీరపాండియన్‌కు ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో జరిగిన మీ కోసంలో ప్రజల నుంచి కలెక్టర్‌తో పాటు జేసీ రమామణి, జేసీ–2 సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డీఆర్‌ఓ ఎస్.రఘునాథ్, జేడీఏ శ్రీరామ్మూర్తి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశం, డీఆర్‌డీఏ పీడీ కె.ఎస్.రామారావు అర్జీలు స్వీకరించారు.
అర్జీల్లో ఏ సమస్యలున్నాయంటే...:
♦ రోడ్డు స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని రుద్రంపేట పంచాయతీకి చెందిన జి.రామాంజనేయులు ఫిర్యాదు చేశాడు. రోడ్డు స్థలంలో కట్టడాలు తొలగించాలని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదని ఫిర్యాదు చేశాడు.
♦ రేషన్ కార్డు ఉన్న బధిరులకు కూడా 35 కేజీలు బియ్యం ఇవ్వాలని బధిరుల సంఘం ప్రధాన కార్యదర్శి బి.రాఘవేంద్ర మీకోసంలో విన్నవించాడు.
♦ ఎస్‌ఎస్‌ఏలో పనిచేస్తున్న కాం ట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరి ష్కరించాలని సంఘం అధ్యక్షుడు కె.విజయ్, ఇతర నాయకులు కోరారు.
♦ ఎస్‌ఎస్‌ఏలో వివిధ విభాగాల్లోని ఉద్యోగులకు విద్యాశాఖలో విలీనం చేయాలని ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల రిజిష్టర్డ్ యూనియన్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు సాజిద్‌బాషా, కార్యదర్శి హాజీమాలిక్, నాయకురాళ్లు నాగరత్నమ్మ, కల్పన, సుమలత, రాజమ్మ, భావన, ఇందిరా విన్నవించారు.
♦ బుక్కరాయసముద్రం మండలం అమ్మవారిపేట, రేకులకుంట, కొండాపురం, ఓబుళాపురం గ్రామాల్లో అధికంగా రజక కుటుంబాలు ఉన్నాయని, ఈ ప్రాంతాల్లో ధోబీఘాట్ నిర్మించాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షుడు లింగమయ్య, నాయకులు హరికృష్ణ, రజకులు కోరారు.
అయ్యా..నాళుగేళ్లగా తిరుగుతున్నాం
అయ్యా.. మా అబ్బాయి తరుణ్‌రెడ్డి (12) బుద్ధిమాద్యంతో ఎదుగుదలలేకుండా పోయింది. పింఛను కోసం నాలుగేళ్లగా తిరుగుతున్నాం. రేషన్ కార్డు మీద వేరొకరు పింఛను తీసుకుంటున్నట్లుగా ఆన్‌లైన్‌లో చూపుతోందని అధికారులు చెప్తున్నారు. మార్పు చేయించుకుపోయినా పింఛన్ రాలేదు. ఎంపీడీఓను అడిగితే ఎమ్మెల్యే చెప్పిన వారికే పింఛన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలున్నాయని సమాధానం ఇస్తున్నారు. మాలాంటి పేదోళ్లకు న్యాయం చేయండి అంటూ గుంతకల్లు మండలం అయ్యవారిపల్లికి గ్రామానికి చెందిన వి. శివరామిరెడ్డి కలెక్టర్‌కు విన్నవించుకున్నాడు. ఇలా ఎందరో వివిధ సమస్యలపై కలెక్టరేట్‌లో వినతులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment