ధర్నాలో ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న నాయకులు
ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 6 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు రూపొందించింది. ఇందులో భాగంగా గురువారం ఒంగోలులో కలెక్టరేట్ వద్ద ఆ పార్టీ నాయకులు ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు, రైతులు పాల్గొని ప్రత్యేక హోదా...ఆంధ్రుల హక్కంటూ నినాదాలు చేశారు...
ఒంగోలు: రాష్ట్రం అభివృద్ధి సాధించాలన్నా, పరిశ్రమలతో కళకళలాడాలన్నా, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కాలన్నా ప్రత్యేక హోదా తోనే సాధ్యమని, దానిని సాధించుకునేందుకు నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిర్వహించిన ధర్నాకు బాలినేని అధ్యక్షత వహించారు. ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక హోదా... ఆంధ్రుల హక్కంటూ నినాదాలు చేశారు. కార్యక్రమానికి ఆరంభంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగపండు ఉష ఆధ్వర్యంలో హోదాపై వారు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఉద్యమ స్ఫూర్తిని రగిల్చాయి. శిబిరం వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బాలినేని ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
వెంకన్న స్వామి సాక్షిగా మోసం: ‘‘ప్రత్యేక హోదా ఐదేళ్లు ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ అంటే, కాదు పదేళ్లు అని వెంకయ్యనాయుడు, కాదు కాదు 15 ఏళ్లు కావాలంటూ మోదీ సమక్షంలో చంద్రబాబు నినదించారు. ఇదంతా ఎన్నికలకు ముందు మాటలు. కానీ అధికారంలోకి రాగానే రూటుమార్చి అర్ధరాత్రి కనీసం రాష్ట్ర ప్రజానీకానికి ఏమాత్రం వివరాలు చెప్పకుండా ప్యాకేజీ కోసం ఒప్పందం చేసుకొని తిరుమల వెంకన్నస్వామి సాక్షిగా ఇచ్చిన హోదాకు తూట్లు పొడిచి రాష్ట్ర ప్రజానీకాన్ని నిలువునా మోసం చేశారు’ అని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. కానీ చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే జేబులు నింపుకునేందుకు, పనుల పేరుతో పర్శంటేజీలు కొట్టేసేందుకే కేంద్రం తో ప్యాకేజీ ఒప్పందం కుదుర్చుకున్నార ని దుయ్యబట్టారు. ఇటీవల బాబు నిర్వహించిన సర్వేలో జనం ఇచ్చిన దిమ్మతిరిగే తీర్పుతో బాబు మాట మార్చి ప్రత్యేక హోదా అంటున్నారన్నారు. బాబు నైజం మోసం చెయ్యడమే అనే విషయం ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, ఉద్యోగాలు పెరుగుతాయని, 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రత్యేక హోదా కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాటం చేస్తామన్నారు.
సమావేశంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలపు సురేష్, మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాచిన చెంచుగరటయ్య, పిడతల సాయికల్పనా రెడ్డి, నియోజకవర్గాల సమన్వయకర్తలు ఐవి.రెడ్డి (గిద్దలూరు), తూమాటి మాధవరావు (కందుకూరు), బుర్రా మధుసూదన్ యాదవ్ (కనిగిరి), బాదం మాధవరెడ్డి (దర్శి), వరికూటి అశోక్‌బాబు (కొండపి), యడం బాలాజి (చీరాల), రావి రామనాథంబాబు (పర్చూరు), వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు, రాష్ట్ర అధికార ప్రతినిధులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, వెన్నా హనుమారెడ్డి, కాకుమాను రాజశేఖర్, వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, నాయకులు కేవీ రమణారెడ్డి, వేమూరి సూర్యనారాయణ, చుండూరి రవిబాబు, వై.వెంకటేశ్వరరావు, పటాపంజుల శ్రీనివాసరావు, వరికూటి కొండారెడ్డి, ధూళిపూడి ప్రసాద్‌నాయుడు, చావలి శివాజి, డీఎస్ క్రాంతికుమార్, పోకల అనూరాధ, పురిణి ప్రభావతి, కావూరి సుశీల, షేక్ సుభాని, యనమల నాగరాజు, నెరుసుల రామకృష్ణ, మిడసల వెంకట విశ్వేశ్వరరావు, మాలే విజయశంకరరెడ్డి, బడుగు కోటేశ్వరరావు, అన్నెం వెంకట్రామి రెడ్డి, కటారి ప్రసాద్, పందిళ్ల రాధ, లంకపోతు అంజిరెడ్డి, దాసరి గోపాల్ రెడ్డి, రాయపాటి అంకయ్య, వీఆర్‌సీ రెడ్డి, పల్లపోలు మల్లిఖార్జున రెడ్డి, ఆళ్ల రవీంద్రారెడ్డి, అంచిపోగు రమేష్‌బాబు, గంగాడ సుజాత, బడుగు ఇందిర, కఠారి రామచంద్రరావు, గంటా వెంకట రామానాయుడు, కఠారి శంకరరావు, సయ్యద్ జలీల్, కర్నేటి వెంకటప్రసాద్, రేలా అమర్‌నాథ్‌రెడ్డి, రాయని వెంకట్రావు, కంకణాల వెంకట్రావు, ఎం.వి.విఎస్ వేణుగోపాల్, మారెడ్డి రామకృష్ణారెడ్డి, చిన్నపరెడ్డి అశోక్‌రెడ్డి, బడుగు ఇందిర, బైరెడ్డి అరుణ, చింతంగుంట్ల సువర్ణ, మొహమ్మద్ చాంద్‌బాషా, తానిపర్తి బ్రహ్మారెడ్డి, పల్లా అనూరాధ, కాకుమాను సునీల్‌రాజ్, గాంట్ల యశ్వంత్‌వర్మ, పి.గోవర్ధనరెడ్డి, వల్లెపు మురళి, పోలూరి కిశోర్, పమ్మి శేషిరెడ్డి, షేక్ మీరావలి, పెద్దిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అనంతలక్ష్మి, శ్యామల భాస్కరరెడ్డి, పి.రత్నరాజు, టి.యలమంద, పి.అంజిరెడ్డి, ఇంతిజార్‌బాషా, జాని, పార్టీ నాయకులు పి.అక్కిరెడ్డి, పి.అశోక్ కుమార్, జజ్జర ఆనందరావు, టి.సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను మోసపుచ్చడమే బాబు నైజం
ముఖ్యఅతిథిగా వచ్చిన ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ మాయమాటలతో ప్రజలను మోసపుచ్చడమే చంద్రబాబు నైజం అన్నారు. 14వ ఆర్థిక సంఘం హోదా ఇవ్వడానికి వీల్లేదనడం, నీతిఅయోగ్ సాంకేతికంగా కుదరదని చెప్పడంతోనే తాము ప్యాకేజీకి అంగీకరించినట్లు చంద్రబాబు చెప్పడం ముమ్మాటికీ మోసం అన్నారు. 14వ ఆర్థిక సంఘం ఏర్పాటైంది 2015 మార్చిలో అని, అప్పటి వరకు చంద్రబాబు హోదా కోసం ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేదో సమాధానం చెప్పాలన్నారు. తాను రాసిన లేఖకు 14వ ఆర్థిక సంఘం స్పష్టమైన జవాబు ఇచ్చిందని, అందులో ఎక్కడా హోదా ఇవ్వవద్దని కానీ, ఇవ్వాలని కానీ తాము సూచించమని, ఆ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అని స్పష్టంగా చెప్పారన్నారు. కేవలం సొంత స్వార్థ ప్రయోజనాల కోసం పోలవరంలో ముడుపులు దండుకునేందుకు కాంట్రాక్టర్‌గా కూడా మారారంటూ విమర్శించారు. ఓటుకు నోటు కేసు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందో అనే భయంతోనే రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టారని భగ్గుమన్నారు.
నాలుగేళ్లుగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద, గుంటూరులో 8 రోజుల ఆమరణ దీక్షతోపాటు ప్రత్యేక హోదా అంటే ఏంటి, దాని వల్ల రాష్ట్ర అభివృద్ధికి ఎలా నిధులు వస్తాయి, యువతకు ఎలాంటి ఉపయోగం ఉంటుందనే అంశాలపై ప్రజలను, యువతను చైతన్యవంతులను చేశారన్నారు. రాష్ట్ర లోటు బడ్జెట్ రూ.15,690 కోట్లు ఉంటే 2014 మొదలు 2017 వరకు కేవలం రూ.3,900 కోట్లు ఇచ్చిన అరుణ్‌జైట్లీ ఇక కేవలం వందో, రూ.150 కోట్లు మాత్రమే లోటు బడ్జెట్ ఇవ్వాలని పేర్కొంటుంటే బాబు మౌనం వహించడానికి గల కారణాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే పార్లమెంట్‌లో తన పేరుమీద ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు బిల్లుతో పాటు 184 కింద నోటీసు కూడా ఇచ్చామన్నారు. ఈ రెండింటి ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్‌లో ఓటింగ్ కోసం అన్ని రాష్ట్రాల ఎంపీల మద్దతు కూడగడతామని చెప్పారు. అప్పటికీ కేంద్రం ముందుకు రాకపోతే మోదీపై అవిశ్వాసానికి సైతం సిద్ధంగా ఉన్నామని, ఇదే వైఎస్సార్ సీపీ విశ్వసనీయత అంటూ ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment