
సాక్షి, కామారెడ్డి జిల్లా: కామారెడ్డి కలెక్టరేట్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నించారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు-పోలీసుల మధ్య తోపులాట జరిగింది. కలెక్టరేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బండి సంజయ్‌ను కామారెడ్డి పీఎస్‌కు తరలించారు.
బీజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో బారికేడ్లు ఎత్తిపడేశారు. బండి సంజయ్‌ను తరలిస్తున్న వాహనంపై రాళ్ల దాడి చేశారు. పోలీస్ వాహనాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆందోళనకారులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment