వాషింగ్టన్ : కరోనా వైరస్ కారణంగా కన్నుమూసినప్పటికీ అమెరికా ఎన్నికల్లో విజేతగా నిలిచాడో అభ్యర్థి. వివరాలు.. నార్త్ డకోటాకు చెందిన డేవిడ్ ఆండాల్(55) రిపబ్లికన్ పార్టీ తరపునుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌కు పోటీ చేస్తున్నాడు. గత నెలలో ప్రచారంలో ఉండగా కరోనా బారిన పడ్డారు డేవిడ్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల తర్వాత మృత్యువాతపడ్డారు. అయితే ఎన్నికలకు కొన్ని రోజుల ముందే డేవిడ్ చనిపోవటంతో బ్యాలెట్ల నుంచి అతడి పేరును తొలిగించలేని పరిస్థితి ఏర్పడింది. ( అక్కడ ట్రంప్‌కే అవకాశాలెక్కువ )
దీంతో మంగళవారం అతడి పేరును తీసివేయకుండానే ఓటింగ్ నిర్వహించారు అధికారులు. ఈ నేపథ్యంలో డేవిడ్ ఆండాల్ 5,901.. 35 శాతం ఓట్లు గెలుపొంది ఎన్నికల్లో విజయం సాధించారు. నార్త్ డకోటా నుంచి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌కు ఎన్నికైన ఇద్దరు రిపబ్లికన్లలో డేవిడ్ ఒకరు. కాగా, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ 214 ఓట్లు సాధించారు.( అమెరికా ఎన్నికలు: ఆయన చెప్పినట్లే జరిగింది..!)
Comments
Please login to add a commentAdd a comment