నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : ఈ నెల 2వ తేదీన జరిగిన వీఆర్వో, వీఆర్‌ఏ పరీక్షల్లో జిల్లావాసులు టాప్‌లేపారు. వీఆర్వో పరీక్షలో 100కు 100 మార్కులు సాధించిన శ్యాంసుందర్‌రెడ్డి ప్రథమస్థానంలో నిలిచాడు. వీఆర్వో, వీఆర్‌ఏ మెరిట్ జాబితాను జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు శనివారం విడుదల చేశారు. జిల్లాలో 68 వీఆర్వో పోస్టులకు గాను 73690 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 6763 మంది అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను వివిధ కారణాలతో తిరస్కరిం చారు.
201 వీఆర్‌ఏ పోస్టులకు గాను 4468 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కాగా, వీరిలో 384 మంది అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను తిరస్కరించారు. అభ్యర్థుల మెరిట్‌జాబితాను ఠీఠీఠీ.్చజౌఛ్చీ.జీఛి.జీ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. మెరిట్ ప్రాతిపదికపై రోస్టర్ విధానాన్ని పాటిస్తూ పోస్టులు భర్తీ చేస్తారు. ఈనెల 25, 26 తేదీల్లో అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. వీఆర్వో అభ్యర్థులకు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలో, వీఆర్‌ఏ అభ్యర్థులకు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఆర్డీఓ అధ్యక్షతన సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఒక్కో పోస్టుకు 1:3 చొప్పున ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
టాప్‌లేపారు
Published Sun, Feb 23 2014 4:18 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement