జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బుధవారం అధికారికంగా ప్రకటించారు.
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బుధవారం అధికారికంగా ప్రకటించారు. అధికార టీఆర్‌ఎస్, ప్రతిపక్ష పార్టీలు ఒక అవగాహనకు వచ్చి స్థానాలను పంచుకోవడంతో సభ్యుల ఎన్నికకు పోటీ లేకుండా పోయింది.
జిల్లాలో 21స్థానాలకు 39మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే వాటిని పరిశీలనలో 8మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక మిగిలిన 31మందిలో ఉపసంహరణ రోజు 10మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పోటీలో 21మంది మాత్రమే నిలిచారు. దీంతో సభ్యుల ఎన్నికకు పోటీ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ప్రకటించారు.