G.D priyadarshini
-
డీపీసీ ఏకగ్రీవం
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని బుధవారం అధికారికంగా ప్రకటించారు. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీలు ఒక అవగాహనకు వచ్చి స్థానాలను పంచుకోవడంతో సభ్యుల ఎన్నికకు పోటీ లేకుండా పోయింది. జిల్లాలో 21స్థానాలకు 39మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. అయితే వాటిని పరిశీలనలో 8మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక మిగిలిన 31మందిలో ఉపసంహరణ రోజు 10మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. పోటీలో 21మంది మాత్రమే నిలిచారు. దీంతో సభ్యుల ఎన్నికకు పోటీ లేకపోవడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు కలెక్టర్ జీడీ ప్రియదర్శిని ప్రకటించారు. -
మ్యాచ్ ఫిక్సింగే..!
మహబూబ్‌నగర్ టౌన్: జిల్లాలో డీపీసీ(జిల్లా ప్రణాళిక మండలి)సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమైంది. గ్రామీణ సభ్యుల కోటాలో 21 మంది ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని జాబితా విడుదల చేశారు. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు కాగా, ఒకేసారి 10మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడం, 21 స్థానాలకు 21మంది అభ్యర్థులు మిగలడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు కలెక్టర్ ప్రకటించారు. జిల్లాలో 21స్థానాలకు ఎన్నికలు నిర్వహిం చగా అభ్యర్థులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలుచేశారు. మొ త్తం 39మంది అభ్యర్థులు బరిలో ఉండటం తో ఎన్నికలు జరుగుతాయని అందరూ భా వించారు. ఇదిలాఉండగా, లోపాయికారి ఒప్పందంతో ఏకగ్రీవానికి సరిపడా 10 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 39 మంది నామినేషన్లు 21 స్థానాలకు 39మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలుచేశారు. అయితే నామినేషన్ల పరిశీలనలో ఎనిమంది మంది నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. వీరిలో నలుగురు అభ్యర్థులు రిజర్వేషన్లలో కాకుండా, జనరల్ స్థానాల్లో నామినేషన్లు దాఖలుచేసి డిక్లరేషన్‌పత్రంలో మాత్రం బీసీ కులమని పేర్కొన్నారు. మరో నలుగురు అభ్యర్థులు రిజర్వేషన్ల కింద కులం సర్టిఫికేట్లు దాఖలు చేయని కారణంగా ఎనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యా యి. బాలకిష్టన్న(ఆత్మకూర్ జెడ్పీటీసీ), భాస్కర్(మల్దకల్), కవితమ్మ(ధన్వాడ), శకావత్ భీముడు(వంగూర్), హన్మంత్(కొల్లాపూర్), ఖగ్‌నాథ్‌రెడ్డి(ఇటిక్యాల), చంద్రావతి(అయిజ), నవీన్‌కుమార్‌రెడ్డి(కొత్తూ రు), రాజేశ్వర్‌రెడ్డి(గోపాల్పేట్), హైమావతి(మిడ్జిల్) తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఎంపికైన అభ్యర్థులకు బుధవారం కలెక్టర్ జీడీ ప్రియదర్శిని నియామక ఉత్తర్వులు అందజేయనున్నారు. అభివృద్ధి పనులపై డీపీసీ ముద్ర గ్రామ, మండల, జిల్లాస్థాయిలో రూపొందించిన అభివృద్ధి ప్రణాళికలకు సంబంధించి జిల్లా ప్రణాళిక మండలి(డీపీసీ) ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. క్షేత్ర స్థాయిలో జరిగే అభివృద్ధి పనులపైనా సమీక్షించే అధికారం డీపీసీకి ఉంటుంది. జిల్లా ప్రణాళిక మండలిలో మొత్తం 30 స్థానాలు ఉండగా, జెడ్పీచైర్మన్ అధ్యక్షులుగా, కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఒక మైనార్టీతో పాటు మరో ముగ్గురు నిష్ణాతులను ప్రభుత్వం డీపీసీ సభ్యులుగా నామినేట్ చేస్తుంది. -
ఉత్తీర్ణత తగ్గితే ఉపేక్షించం
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: విధి నిర్వహణలో నిర్లక్ష్య వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని ఎంఈఓలను హెచ్చరించారు. గురువారం స్థానిక ఆర్వీఎం కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది పదవ తరగతి ఉత్తీర్ణతాశాతం తగ్గితే సహించేది లేదన్నారు. ఉపాధ్యాయులు సిలబస్ పూర్తి చేసి, రివిజన్ ప్రారంభించాలని, ఎంఈఓలు ప్రతి పాఠశాలను పర్యవేక్షించాలని, విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలని సూచించారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వం విద్యపై కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నదని, క్షేత్రస్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ఎంఈఓలపై ఉందన్నారు. విద్యార్థులను సొంతపిల్లల్లా చూసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దేందుకు కృషి చేయాలన్నారు. పనితీరు సరిగ్గాలేని ఉపాధ్యాయులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. జాబ్‌చార్ట్ ప్రకారం విధులు నిర్వహించాలని, ఇకపై డీఈఓ నుంచి టూర్‌డైరీ తెప్పించుకొని చూస్తానన్నారు. ఏజేసీ, డీఈఓలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తుంటారన్నారు. ఇటీవల కొందరు ఉపాధ్యాయులు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. బాలికల పాఠశాలలను ప్రత్యేకంగా సందర్శించాలని అధికారులను ఆదేశించారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుకు కృషి చేయాలని సూచించారు. అంతకు ముందు ఏజేసీ రాజారాం, డీఈఓ రాజేష్ ఎంఈఓలతో సమావేశమై నాణ్యమైన విద్య అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, రేడియో కార్యక్రమాలు, మీనాప్రపంచం, ఎల్ఈపిత్రిపుల్ ఆర్ పురోగతిపై చర్చించారు. రాష్ట్ర బృందం పరిశీలన తర్వాత ఎంఈఓలు తీసుకున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. పిల్లల సామార్థ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంఓ రవీందర్, సిఎంఓ కృష్ణయ్య, ఐఈడీ కో ఆర్డినేటర్ వెంకటేశ్వర్, అసిస్టెంట్ ఎఎంఓ జంగయ్య తదితరులు పాల్గొన్నారు. -
పక డ్బందీగా కుటుంబ సర్వే
మహబూబ్‌నగర్‌టౌన్: సమగ్ర కుటుంబ సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.డి.ప్రియదర్శిని అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఆమె రెవెన్యూ సమావేశ మందిరంలో మండల ప్రత్యేకాధికారులతో సర్వే నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేకాధికారులు 19వరకు ఎట్టి పరిస్థితులలో మండలాలను విడవ రాదన్నారు. బుధవారం నుంచి గ్రామాల్లో టాంటాం వేయించాలని, పత్రికలు, ఎలక్ట్రానిక్ చానళ్ల ద్వారా ప్రచారం నిర్వహించాలన్నారు. గ్రామ పంచాయతీలు, హోటళ్లు, బస్టాండ్ తదితర ప్రాంతాల్లో సర్వేపై బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాల్లో అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు సర్వేపై అవగాహణ కల్పించి, వారి ద్వారా తల్లిదండ్రులను చైతన్యం చేయూలన్నారు. సినిమా హాళ్లలో స్లైడ్స్ వేయించాలన్నారు. సర్వేపై జిల్లా వ్యాప్తంగా 11వేల గోడ పత్రికలు పంపిణీ చేయనున్నామని, వాటిని సరైన ప్రాంతాల్లో అతికించాలని సూచించారు. సమగ్ర కుటుంబ సర్వేపై ఈనెల 7నుంచి మండల స్థాయి రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తామని,అనంతరం ఇతరులకు శిక్షణ ఉంటుందన్నారు. ప్రత్యేకాధికారులు సర్వేకు సంబందించిన రూట్‌మ్యాప్, వాహనాలపై ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు అధికారులందరూ సమగ్ర కుటుంబ సర్వేను ఎన్నికల డ్యూటీలా భావించి జిల్లాలో విజయవంతం చేయూలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, ఏజెసి రాజారాం, డీఆర్ఓ రాంకిషన్, జెడ్పీసీఈఓ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.