ఎన్నికలన్నీ ముగిశాయి.ఫలితాలే తరువాయి. జమిలి ఎన్నికల్లో పోటీలో ఉన్నవారంతా ఓట్ల తీరుపై లెక్కలు వేసుకుంటుంటే పందెపు రాయుళ్లు ఆ ఉత్కంఠకు మరింత పదును పెడుతున్నారు. ఎక్కడ ఎవరు గెలుస్తారు..మెజార్టీ ఎంతా..అంటూ రకరకాలుగా కాయ్ రాజా కాయ్ అంటున్నారు. లెక్కింపు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సీనును రక్తికట్టించి అన్ని పార్టీల వారినీ కవ్విస్తున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా భారీ మొత్తాల్లో బెట్టింగులు సాగుతున్నాయి. లెక్కింపు అంకానికి పదును పెడుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: నెల రోజుల వ్యవధిలో జరిగిన మూడు ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లే ని రీతిలో ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైన అధికార యంత్రాంగం ఓట్ల లెక్కింపు కోసం క సరత్తు చేస్తోంది. గెలుపోటములపై అభ్యర్థులు లెక్కలు వేసుకుంటుం డగా, పందెంరాయుళ్లు మాత్రం జోరుగా బెట్టింగులు కడుతున్నారు.
మున్సిపల్, జ డ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పోలిస్తే సా ధారణ ఎన్నికల్లో ఓటరు తీర్పు భిన్నంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక సమస్యలు, అ భ్యర్థుల గుణగణాల ప్రాతిపదికగా ఓటిం గ్ జరిగింది. సాధారణ ఎన్నికల్లో మాత్రం స్థానిక అంశాలతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి అంశాలు కూడా కీలక పాత్ర పోషించాయి. దీంతో మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు సాధారణ ఎన్నికల్లో ప్రతిబింబించే సూచనలు కనిపించడం లేదు. ఓటరు నాడి అంతు చిక్కక అన్ని స్థాయిల్లోనూ అభ్యర్థులు ఫలితాలపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
మున్సిపల్, మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ల పదవిపై కన్నేసిన ఔత్సాహికులు సొంత ఫలితంతో పాటు పార్టీ అభ్యర్థుల విజయంపైనా ఆసక్తి చూపుతున్నారు.ఈ నేపథ్యంలో పందెం రాయుళ్లు జోరుగా బెట్టింగులు కడుతున్నారు. గెలుపోటములు, మెజార్టీ, సాధించే ఓట్లు వంటి అంశాలపై పందెం కాస్తున్నారు. ఒక్కో పందెం వేలల్లోనే ఉండటంతో ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీ దగ్గర పడే కొద్దీ బెట్టింగు రాయుళ్లు లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లోని 206 వార్డులకు మార్చి 30న ఎన్నికలు జరిగాయి. 1166 మంది అభ్యర్థులు పోటీ చేయగా 73.05శాతం మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మే 12న ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను మహబూబ్‌నగర్ ఎంవీఎస్ కాలేజీ (క్రిష్టియన్‌పల్లి)లో భద్రపరిచారు.
జిల్లాలోని 982 ఎంపీటీసీ స్థానాలు, 64 జడ్పీటీసీ స్థానాలకు ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. 78శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. జడ్పీటీసీ స్థానాలకు 402, ఎంపీటీ సీ స్థానాలకు 3498 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఐదు ఎంపీటీసీ స్థానాల ఎన్నిక ఏకగ్రీవపంం కాగా, కొల్లాపూర్ మండలంలో రెండు ఎంపీటీసీ స్థానాల ఎన్నికల కోర్టు జోక్యంతో వాయిదా పడింది.
ఈ నెల 13న బ్యాలెట్ పద్దతిలో నమోదైన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్టీఆర్ వుమెన్స్ డిగ్రీ కాలేజీ (మహబూబ్‌నగర్), నవోదయ జూనియర్ కాలేజీ (నాగర్‌కర్నూలు), శ్రీదత్త జూనియర్ కాలేజీ (నారాయణపేట), కేడీఆర్ కాలేజీ (వనపర్తి), ప్రభుత్వ జూనియర్ కాలేజీ (గద్వాల), టీవీఎం కాలేజీ (కల్వకుర్తి)లో బ్యాలెట్ బాక్సులు భద్రపరిచారు.
రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 30న పోలింగ్ జరిగింది. 73.05శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రెండు లోక్‌సభ స్థానాలకు 15 మంది, 14 అసెంబ్లీ స్థానాలకు 149 మంది అభ్యర్థులు బరిలో వున్నారు. జేపీఎన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచారు. మే 16న ఓట్ల లెక్కింపు జరగనుంది.
భయ్..పందెమేస్తవా..!
Published Mon, May 5 2014 2:36 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement