చంద్రయాన్ 3.. 'టెర్రర్ టైం' గురించి తెలుసా? | India 20 Minutes Of Terror In Chandrayaan 3 Moon Landing | Sakshi
Sakshi News home page

చంద్రయాన్ 3: చంద్రుడిపై దిగేటప్పుడు ‘టెర్రర్‌ టైం’లో జరిగేది ఇదే..

Published Tue, Aug 22 2023 7:19 PM | Last Updated on Tue, Aug 22 2023 10:12 PM

India 20 Minutes Of Terror In Chandrayaan 3 Moon Landing - Sakshi

చంద్రయాన్ 3లో భాగంగా చంద్రుడిపై ఇస్రో ల్యాండర్‌ అడుగుపెట్టే క్షణం కోసం భారత్‌తో పాటు యావత్ ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన చంద్రయాన్ 3 అడుగు దూరంలోనే ల్యాండింగ్‌ కోసం వేచి ఉంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ఆ అపురూప ఘట్టం ఆవిషృతమౌతుందని ఇస్రో వర్గాలు ఇప్పటికే తెలిపారు. చంద్రునిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ చేయడంలో సఫలమైతే భారత్ అజేయంగా నిలుస్తుంది.  

సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే క్రమంలో చివరి 20 నిమిషాలు చాలా కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం శాస్త్రవేత్తల బృందం మాడ్యూల్‌లోని సాంకేతికతను నిరంతరం తనిఖీ చేస్తున్నారు. నిర్దేశిత ప్రదేశంలో దిగడానికి సూర్యదయం కాగానే ప్రక్రియను ప్రారంభించనున్నారు. బుధవారం సాయంత్రం 5.45 తర్వాత అసలైన ప్రక్రియ ప్రారంభమైతుందని అంచనా వేస్తున్నారు. ఒకసారి ప్రక్రియ ప్రారంభమైన తర్వాత చివరి '20 మినెట్‌ టెర్రర్‌'గా అభివర్ణించారు. 

చంద్రుడి ఉపరితలానికి 30 కి.మీల దూరంలో ల్యాండర్ పవర్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. అక్కడి నుంచి నిమిషాలు కీలకం. చంద్రుని గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా ల్యాండర్ తన ఇంజన్లను మండించుకుంటుంది. ఆ తర్వాత 11 నిమిషాల పాటు రన్ బ్రేకింగ్ దశ ప్రారంభం అవుతుంది. ఈ దశలో ల్యాండర్ చంద్రునికి సమాంతరంగా ఉంటుంది. క్రమంగా ఫైన్ బ్రేకింగ్ దశలోకి వస్తుంది. అక్కడ ల్యాండర్ 90 డిగ్రీల వంపు తిరుగుతుంది. ఈ దశలోనే గతంలో చంద్రయాన్ 2 కూలిపోయింది. 

ఈ దశల అనంతరం చంద్రునికి కేవలం 800 మీటర్ల ఎత్తులో ల్యాండర్ వేగం సున్నాకు చేరుతుంది. చివరకు 150 మీటర్లకు చేరుకోగానే సరైన ప్రదేశం కోసం ల్యాండర్ వెతుకుతుంది. సరైన స్థలంలో సెకనుకు 3 మీటర్ల వేగంతో జాబిల్లి ఉపరితలాన్ని తాకుతుంది. ఈ విధంగా చివరి 20 నిమిషాల టెర్రర్ టైంకు తెరపడి మిషన్ విజయవంతం అవుతుంది. ఆ తర్వాత చంద్రునిపై ల్యాండర్ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుందని ఇస్రో వెల్లడించింది.    

ఇదీ చదవండి: మరికొన్ని గంటల్లో చంద్రుని ఉపరితలంపైకి.. చంద్రయాన్‌-3ని హాలీవుడ్‌ మూవీతో పోలుస్తూ..

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement