ఓటీటీలోకి సిద్ధార్థ్‌.. స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే.. | Siddharth OTT Debut Escaype Live Will Streaming On Disney Plus Hotstar | Sakshi
Sakshi News home page

Siddharth Escaype Live: ఓటీటీలోకి అడుగుపెట్టిన సిద్ధార్థ్‌..

Published Tue, May 10 2022 9:16 PM | Last Updated on Tue, May 10 2022 9:31 PM

Siddharth OTT Debut Escaype Live Will Streaming On Disney Plus Hotstar - Sakshi

Siddharth OTT Debut Escaype Live Will Streaming On Disney Plus Hotstar: టాలీవుడ్‌లో లవర్‌ బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు సిద్ధార్థ్. బొమ్మరిల్లుతో సూపర్‌ హిట్‌ కొట్టిన సిద్ధార్థ్‌ ఇటీవల మహాసముద్రం సినిమాతో అలరించాడు. ఈ హీరో తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టనున్నాడు. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ స్పెషల్స్ నిర్మించిన 'ఎస్కేప్‌ లైవ్‌' వెబ్‌ సిరీస్‌తో సందడి చేయనున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌కు సిద్ధార్థ్‌ కుమార్ తివారి దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ డిస్లీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించింది. 'పోటీ చేస్తున్న అమ్మాయిలకు వజ్రాలు బెస్ట్‌ ఫ్రెండ్స్‌. మరీ ఎవరు గెలుస్తారని మీరనుకుంటున్నారు ?' అని ట్వీట్‌ చేసింది. 

ఈ వెబ్‌ సిరీస్‌, డైరెక్టర్‌ గురించి సిద్ధార్థ్‌ మాట్లాడుతూ 'కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాను. తివారితో కలిసి పనిచేయడం నటుడిగా అద్భుతమైన అనుభవం. ఈ ప్రాజెక్ట్‌లో పనిచేస్తూ ప్రేరణ పొందాను. తివారితో స్క్రిప్ట్‌, పాత్రల అభివృద్ధి గురించి జరిపిన చర్చలు నాకు మంచి అనుభవాన్ని ఇచ్చాయి. నేను ఏం చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను. ఆయన ఆశించిన దానికి నేను ఇంకా ఏం ఇవ్వాలి అని నేను అనుకునేవాన్ని. నేను అనుకున్నదంతా చేయగలనని తివారి నన్ను నమ్మారు.' అని చెప్పుకొచ్చాడు. ఈ వెబ్‌ సిరీస్‌ ఒక యాప్‌లో నిర్వహించే పోటీ ఆధారంగా తెరకెక్కించిన కల్పిత కథ అని సమాచారం. 

చదవండి: భయపెట్టేందుకు వచ్చేస్తున్న మహారాష్ట్ర జాంబీలు.. చూసేందుకు సిద్ధమా !




No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement