
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం 'సలార్: పార్ట్-1 సీజ్‍ఫైర్'. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం గతేడాది డిసెంబర్‌లో థియేటర్లలోకి వచ్చింది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన సలార్ బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబట్టింది. దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. జనవరి 20వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‍కు వచ్చిన సలార్ ఓటీటీలో దూసుకెళ్తోంది.
అయితే తాజాగా ఈ చిత్రం మరో ఓటీటీలోకి వచ్చేసింది. అయితే కేవలం హిందీ భాషలోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఈ రోజు నుంచే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. అయితే తెలుగులో కూడా వచ్చి ఉంటే బాగుండేదని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ రాబోయే రోజుల్లో దక్షిణాది భాషల్లోనూ అందుబాటులోకి వస్తుందేమో వేచి చూడాల్సిందే.
Jab bhi Deva bulayega, Hum aayenge! #SalaarHindi Now Streaming #Salaar #SalaarOnHotstar #Prabhas #PrashanthNeel @PrithviOfficial @shrutihaasan @VKiragandur @hombalefilms @ChaluveG @IamJagguBhai @sriyareddy @RaviBasrur @bhuvangowda84 @vchalapathi_art @anbariv @SalaarTheSaga pic.twitter.com/pZfK2LVagB
— Disney+ Hotstar (@DisneyPlusHS) February 16, 2024