టీ20 వరల్డ్‌కప్-2022లో భాగంగా అడిలైడ్ వేదికగా నిన్న (నవంబర్ 2) జరిగిన భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ టోర్నీ డిజిటల్ ప్రసారదారు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ మ్యాచ్ హాట్‌స్టార్ హిస్టరీలో నమోదైన గత రికార్డులన్నింటినీ తిరగరాసింది. హాట్‌స్టార్ పెయిడ్ వర్షెన్ అయ్యాక అత్యధిక వ్యూస్ దక్కించుకున్న మ్యాచ్‌గా భారత్-బంగ్లా సమరం రికార్డుల్లోకెక్కింది.
ఈ మ్యాచ్‌ను ఒకానొక సందర్భంలో 19 మిలియన్ల మంది వీక్షించారు. హాట్‌స్టార్ చరిత్రలో ఇదే అత్యథిక వ్యూయర్‌షిప్ రికార్డు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు హాట్‌స్టార్ అత్యధిక వ్యూయర్‌షిప్ రికార్డు.. ఇదే వరల్డ్‌కప్‌లో జరిగిన భారత్-పాక్ మ్యాచ్ పేరిట నమోదై ఉండింది. ఆ మ్యాచ్‌ను దాదాపు 18 మిలియన్ల మంది వీక్షించారు. హాట్‌స్టార్ చరిత్రలో అత్యధిక వ్యూయర్‌షిప్ దక్కించుకున్న మ్యాచ్‌ల జాబితాలో మూడో స్థానంలో కూడా భారత్ ఆడిన మ్యాచే ఉంది.
Hotstar's peak viewership in 2022:
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 2, 2022
India Vs Bangladesh (T20 WC) - 19M.
India Vs Pakistan (T20 WC) - 18M.
India Vs Pakistan (Asia Cup) - 14M.
ఆసియా కప్-2022లో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌ను 14 మిలియన్ల మంది చూశారు. మొత్తంగా నరాలు తెగే ఉత్కంఠ నడుమ, చివరి నిమిషం వరకు నువ్వా-నేనా అన్నట్లు సాగిన భారత్-బంగ్లా సమరం డిజిటల్ ఫ్లాట్‌ఫాం రికార్డులు బద్ధలు కొట్టడంతో పాటు క్రికెట్ లవర్స్‌కు పొట్టి క్రికెట్ అసలుసిసలు మజాను అందించింది. ఈ మ్యాచ్ చిరకాల ప్రత్యర్ధులైన భారత్-పాక్ మ్యాచ్‌ను సైతం తలదన్నేలా వ్యూయర్‌షిప్ దక్కించుకుందంటే.. ఏ రేంజ్‌లో ఉత్కంఠ కొనసాగిందో అర్ధం చేసుకోవచ్చు.
కాగా, వర్షం అంతరాయం నడుమ రసవత్తరంగా సాగిన భారత్-బంగ్లా సమరం.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మరో హైఓల్టేజీ మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 5 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో) బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి, సెమీస్ బెర్తు ఖరారు చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్..ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లి (44 బంతుల్లో 64 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్), కేఎల్ రాహుల్ (32 బంతుల్లో 50; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేయగా.. ఛేదనలో బంగ్లాదేశ్ 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్ సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా టార్గెట్‌ను 16 ఓవర్లలో 151 పరుగులుగా నిర్ధేశించారు.
Comments
Please login to add a commentAdd a comment