
క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురుచూస్తన్న ఆసియాకప్-2023కు సమయం దగ్గరపడుతోంది. ఆగస్టు 30న ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, నేపాల్ మధ్య జరగనున్న మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇక ఈ టోర్నీ కోసం 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది.
కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వగా.. యువ సంచలనం తిలక్ వర్మకు తొలిసారి వన్డే జట్టులో చోటుదక్కింది. ఈ మెగా ఈవెంట్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 2న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది.
క్రికెట్ అభిమానులకు గుడ్‌న్యూస్..
ఆసియాకప్ మ్యాచ్‌లను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఫ్రీగా లైవ్‌స్ట్రీమింగ్ ఇవ్వనుంది. అభిమానులు మ్యాచ్‌లను తమ మొబైల్‌లో ఉచితంగా చూసుకోవచ్చు. అయితే ఫ్రీ ఉచిత స్ట్రీమింగ్‌ను హైలైట్ చేస్తూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓ వీడియోను రీలీజ్ చేసింది. భారత్‌లో మొబైల్ వాడకందారులకు తమ ఫ్లాట్‌ఫామ్‌ను మరింత చేరువ చేయడమే హాట్‌స్టార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడిగా వెళ్లినా క్రికెట్‌ను ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడవచ్చని అర్ధం వచ్చేలా హాట్‌స్టార్ ఈ వీడియోను రూపొందించింది.
ఆసియా కప్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసీద్ధ్ కృష్ణ.
చదవండి: CSK To Release Ben Stokes: చెన్నై సూపర్ కింగ్స్ కీలక నిర్ణయం.. 16 కోట్ల ఆటగాడికి గుడ్‌బై
Comments
Please login to add a commentAdd a comment